Monday, June 8, 2009

అవినీతికి పునాదులు మనమే.

దేవుడు లేని చోటైనా వుంటుందేమో గాని అవినీతి లేని చోటు వుండదేమో! అవినీతి నిరోధక శాఖ వారికి రాజశేఖర రెడ్డి ఇచ్చిన ధైర్యం చాలా మెచ్చుకోగలిగిందే. వేయిమైళ్ళ ప్రయాణానికి మొదటి అడుగులాంటిది అడుగు. అవినీతి ఎక్కడెక్కడ పుడుతుందో అందరికీ తెలుసు. ప్రతి శాఖలో రక రకాలైన లైసెన్సులు ఇవ్వడానికి గాని, రెన్యువల్ చెయడానికి అయ్యే ఇతర ఖర్చులు అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రైవేటు కంపెనీలల్లోకూడా ఎంత అవినీతి పేరుకుపోయిందో చెప్పక్కర్లేదు. ఐటి కంపెనీ వుద్యోగాలకు బ్యాక్ డోరు పద్దతిలో చేరడం అంటే అందరికీ తెలిసిందే. కాస్త నీతిగా వుందామనుకునే వారు ఎలాంటి మానసిక వత్తిడికి లోనవుతుంటారో చెప్పక్కర్లేదు. కొన్ని శాఖల్లోనా నిజాయితీతో పని లేకుండా నా వాటా నీకు వచ్చి పడుతుంటే నా తప్పేమీ లేదనుకున్న వారు లేక పోలేదు. అయినా ఇచ్చే చేయి వుంటే కదా పుచ్చుకునే చేయి ముందుకు వస్తుంది.
మనలో ఎంతమంది ఏమీ ఇవ్వకుండా పని అయ్యే దారి (చట్టపరంగా) వుందా అనే ప్రయత్నం చేస్తారు చెప్పండి? అడిగే వాళ్ళని మేమెందుకు డబ్బులివ్వాలని అడిగే ధైర్యం మనకు లేదా? అప్పుడే మన టైమంతా వృధా అయిపోతున్నట్లు, అందుకే ఈ అడ్డ దారిలో వెళ్ళడం అవసరం అన్నట్లు ప్రవర్తిస్తాం. కాబట్టి ఒక్క రూపాయి కూడా అవినీతికి పునాది కాకుండా చూసే బాధ్యత మనదే అంటే అతిశయోక్తి కాదేమో!

No comments:

Post a Comment