Tuesday, September 27, 2011

పాడుతా తీయగా -2

నిన్న ప్రసారం అయిన పాడుతా తీయగా ఒక ఆణి ముత్యం అనే చెప్పుకోవాలి. మానస వీణా మధుగీతం మరియు మ్రోగేనా ఈ వీణ పాడిన దామిని , సాయిరమ్యలు అందరినీ వెనకటి రోజులకు తీసుకెళ్ళి పోయారంటే అతిశయోక్తి కాదేమో!ముఖ్యంగా సాయిరమ్య  పాడుతున్నపుడు కళ్ళలో నీళ్ళు రాని వారు ఉండి ఉండరేమో!
మానస వీణ పాటను ఆ రోజుల్లో క్యాసెట్టులో ఒకే వైపు నాలుగైదు సార్లు రికార్డు చేసుకుని ఎన్నో  సార్లు విన్నాను నేను.
బాలు గారు చేస్తున్న ఈ కార్యక్రమం  ఎటువంటి నాటకీయత లేకుండా స్వచ్చంగా మరియు అందరి మన్ననలను పొందుతూ కలకాలం  సాగిపోతున్దాలని ఆశిద్దాం!


Monday, September 26, 2011

Bhojanam

భోజనం 
కేవీడీ శర్మ గారింట 
అన్నపూర్ణమ్మ గారి చేతి వంట.
పెరటి తోటలో పెరిగిన 
గోంగూరకు తాలింపు వేసి చేసిన పచ్చడి. 
అరుగులు దాటి పరుగులు తీసే వాసనలు 
వెదజిమ్మే ఉల్లిపాయ సాంబారు. 
మేమున్నామంటూ వేంచేసిన 
వేపుడు కూరలూ, అప్పడాలూ.
రసానుభూతిని కల్గించే టమాటో రసం తర్వాత 
తీపి పెరుగన్నంతో ఆవకాయ నంజుకుంటూ 
తినే భాగ్యం ఈ బాపూజీకే సొంతం!!
 

Tuesday, September 13, 2011

కారు ఘోష

కారు ఘోష 
సూరి వారి ఇంట కాలిడిన నేను 
కలగన్నాను ప్రపంచమంతటా 
చూస్తానని.
కళ్ళు తెరిచినా మూసినా ఏమీ 
కనబడదు అనుకోలేదు నేను.
తోటి కార్లు రివ్వున రివ్వున 
రోడ్డు మీద వెళ్తుంటే 
కారు నలుపు కవరులోన 
కుమిలి పోవలసిందేనా నేను. 
ఈ కారు బ్రతుకు ఇంత 
ఘోరమనుకోలేదు నేను.
బంగారు పంజరంలోని 
పక్షి  కన్నా హీనంగా 
బ్రతుకుతున్నాను నేను.
ఆల్టో లక్ష్మణా అనుకుంటూ! 

Sunday, September 11, 2011

గోదావరి మజిలీ



గల గల పారుతూ వచ్చిన గోదావరి 
రాజమండ్రి రాగానే నిదానమై, నిశ్సబ్దంగా 
నన్నయ వ్రాసిన భారతాన్ని వింటూ 
వంతెనల మీద పరిగెత్తే రైళ్ళను, బస్సులను 
చూస్తూ నెమ్మదిగా ధవలేశ్వరాన్ని దాటి 
పాయలుగా చీలి పచ్చని పొలాలలో 
బంగారం పండిస్తూ సాగరమాత గర్భంలో చేరుకొని 
సేద దీరుతుంది కాబోలు!