Wednesday, April 7, 2010

అందమైన వ్రాత

అబ్బా, నీ వ్రాత ఎంత బావుందో అని ఎవరైనా అంటే ఎంతో పొంగిపోయే వాళ్ళమో కదా! ఎవరి వ్రాత అయినా అర్థం కాకపోతే మెడికల్ షాపు వాళ్ళ దగ్గరికెళ్తే వాళ్ళు చదివి పెడ్తారనుకునే వాళ్ళు. చిన్నప్పుడు కొత్త నోటుబుక్కులకు అట్టలు వేసుకుని లేబుల్స్ అంటించిన తర్వాత కాస్త అందంగా అక్షరాలు వ్రాసే వాళ్ళను బ్రతిమాలి లేబుల్స్ మీద పేరు,తరగతి, స్కూలు పేరు వ్రాయించుకునే వాళ్ళం.
వాడి వ్రాత బాగుంది కాని తలరాత ఒక్కటే బాగాలేదు అని అనుకోవడం కద్దు.

No comments:

Post a Comment