Tuesday, July 30, 2019

దున్నే వాడే రైతు

దున్నేవాడే రైతు! వ్యవసాయాన్ని వృత్తిగా చేసుకున్నవాడే రైతు. తన భూమిలో వ్యవసాయం చేసుకునే రైతైనా కౌలు తీసుకుని చేస్తున్న రైతైనా కావచ్చు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేయడమే ముఖ్యం. 
రైతుల్లో తాము చేసే వ్యవసాయాన్ని ఒక వ్యాపారంగా చూసే దృక్పథాన్ని తీసుకుని రావడమే మన ఆశయం కావాలి. అధికంగా పండించండి అనేది కాదు నినాదం. తగినంతగానే పండించి అధికంగా సంపాందించండి అని రైతులను ప్రభావితం చేసి వ్యాపార దృక్పథాన్ని వారిలో కలిగించడమే.అధికంగా పండిస్తే ఏమవుతుంది. గిట్టుబాటు ధరలు రావడము లేదు. పంట కోయడానికి అయ్యే కూలి ఖర్చులు కూడా రాకపోతే పంటను పొలంలోనే వదిలేయడం జరుగుతోంది. ఒక్కో సారి మార్కెట్టుకు తీసుకుని వచ్చాక ధరలు రాకపోతే పోతే ఆవేశంతో రోడ్ల మీదనే పోసి నిరసన చేయడం జరుగుతోంది.