Thursday, June 4, 2009

పద్మార్పిత గారి ఎందుకని కవిత స్ఫూర్తితో

మదిలోని విరహం
కనులలో నీరై కురవంగ
మెరిసే తారకలన్నీమసకబారుతూ కనిపింపంగా
వేసవిలో వీచే వడగాడ్పులైనా
శరదృతువులో వణికించే చలిగాడ్పులైనా
నా ఈ విరహాన్ని మరువనివ్వలేదు ఓ క్షణమైనా
చెదిరి పోలేదు నా ప్రేమ ఇసుమంతైనా.
ప్రేమైనా విరహమైనా
నాణానికి రెండు వైపులు,
పగలు రాత్రుల ప్రతిబింబాలు కాబోలు!
ఏది ఏమైనా ప్రేమామృతాల
విరహాగ్నుల కలబోతే గదా ఈ మనస్సు.

1 comment:

  1. మన్నించాలి నన్ను మీరు....
    మదిలోని మంటను చల్లార్చలేదు ఏ కన్నీరు...
    దారితప్పిన బాటసారి వేరొకరికి దారి చూపించలేరు...
    మునుగుతున్న నావను ఏ తూఫాను ఆపలేదు...
    రాయి ఎప్పుడూ అద్దంతో స్నేహం చేయలేదు...
    ఎడారిలో పూలు పూస్తాయి అన్న ఆశలేదు...
    (May be its not relevant to your kavita sir.... just iam sharing my views)

    ReplyDelete