Saturday, June 20, 2009

మా తెలుగు తల్లి

ఈ మధ్య ఓ పత్రికలో ఇంగ్లీషులో పది లక్షల పదాలు చేరాయి అనే చర్చలో తెలుగులో ఎన్ని పదాలున్నై అనే విషయం ప్రస్తావించబడింది. కాని నా వుద్దేశంలో అందరూ తెలుగులో ఎన్ని పదాలున్నాయని లెక్కపెట్టడం మానేసి, ఎన్ని పదాలు పోగొట్టుకొంటున్నామో లెక్కపెట్టండి. మన పక్కింటి భాష తమిళంలోకి ప్రతి ఇంగ్లీషు పదానికి సరిఅయిన పదాలను సృష్టించి పదసంపదను పెంచుకుంటున్నారు. ఇంటర్నెట్టు, ఫ్యాక్సు లాంటి వాటికి కూడా తమిళ పదాలు వాడకంలో ఉన్నాయి. ఆ మధ్య మాలతీ చందూర్ గారు అరవల భాషాభిమానాన్ని గురించి స్వాతిలో ముచ్చటించారు. మమ్మీ డాడీ అని పిలిపించుకుని మురిసి పోయే అమ్మా నాన్నలు వున్నంత కాలం తెలుగు భాషకు చెదలు పట్టకుండా చూసుకోవాలి మనం!

మమ్మీ డాడీ అని పిలిపించుకునే తెలుగు మాతా పితలు తెలుగునేమి ఉద్ధరిస్తారయ్యా ?
మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని ఇంగ్లీషులో వ్రాసుకుని పాడే పిల్లల తల్లి దండ్రులయ్యా వీరు
డాలర్ల కోసం పరుగెత్తిన పుత్రసంతానాన్ని తల్చుకుని గర్వించే జీవులయ్యా వీరు
ఈ తెలుగు సాయంత్రం తేవాలి తెలుగు భాషా ప్రపంచానికి మరో ఉదయం!

1 comment:

  1. ఒక బ్లాగు టపా చదివి ఏడుపు రావడం ఇదే నాకు మెదటి నూటపదహారవ సారి. అన్నిసార్లూ తెలుఁగు భాష యొక్క దిగజా౨రుడు గుఱించే వ్రాస్తారు!

    ReplyDelete