Monday, June 29, 2009
సామాజిక న్యాయం
నిన్న మగధీర ఆడియో రిలీజు సభలో చిరంజీవి గారిని మళ్ళీ సినిమాలలో నటించమని అందరూ అడగడం, దానికి వారు చూద్దాం అనడం జరిగింది. వారం క్రితం ఇక సినిమాలలో నటించను అని బల్ల గుద్ది చెప్పి, అప్పుడే చూద్దాం అనడం వారి డోలాయమాన మనస్సును సూచిస్తోందా? పార్టీ వ్యవహారాలు చూస్తుంటే ఎవరూ సేరియస్సుగా ఏ విషయాన్నీ పట్టించుకుంటున్నట్టు కనబడటం లేదు. ప్రయివేటు స్కూళ్ళ ఫీజు గురించి ఆందోళన చేపట్టారు గాని స్కూలు భవనాలు లేని గవర్నమెంటు స్కూళ్ళ గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? ఎక్కడండీ సామాజిక న్యాయం?
Friday, June 26, 2009
భగవంతుడు
అంద వికారాలకు అతీతుడు ఆ భగవంతుడు.
రాగ ద్వేషాలు ఎరగని వాడు.
కోపతాపాలు తెలియని వాడినెందుకు ప్రశ్నిస్తారు?
స్వార్థంతో బ్రతికే మనం దేవుడి పేరు చెప్పుకుంటూ
చేసే అన్యాయాలెన్నో?
నరకముందంటూనే చేసే పాపాలెన్నో?
మళ్ళీ క్షమించమని వేడుకోవడమెందుకో?
రాగ ద్వేషాలు ఎరగని వాడు.
కోపతాపాలు తెలియని వాడినెందుకు ప్రశ్నిస్తారు?
స్వార్థంతో బ్రతికే మనం దేవుడి పేరు చెప్పుకుంటూ
చేసే అన్యాయాలెన్నో?
నరకముందంటూనే చేసే పాపాలెన్నో?
మళ్ళీ క్షమించమని వేడుకోవడమెందుకో?
Saturday, June 20, 2009
ప్రజారాజ్యం ఎటు పోతోంది?
ప్రజారాజ్యం పునాదుల్లో ఒకరైన మిత్రా గారు కూడా రాజీనామా చేసారు అంటే ఆశ్చర్యంగా లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు అనే పద్దతిలో ఈ పార్టీ నడుస్తుందేమో అన్పిస్తోంది. సామాజిక న్యాయం అంటూ హోరెత్తించిన ప్రజారాజ్యం పరిస్థితి దయనీయంగా మారుతుందేమో! ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలను కాపాడుకోకపోతే చిరంజీవి ఒక్కరే పార్టీలో ఉంటారేమో?
సమీక్షల పేరుతో ఏర్పాటు చేసిన మీటింగులకు ఎంతమంది వచ్చారో అందరికీ తెలుసు కదా. ఏదో సినిమా ఫ్లాప్ అయినట్లు చిరంజీవి అనుకుంటున్నారేమో. మేలుకోకపోతే అడ్రసు కూడా మిగలదు చిరంజీవి గారూ. సామాజిక న్యాయం సంగతేమో గాని, మిమ్మల్ని, మీ పార్టీ వాళ్ళను గెల్పించిన నియోజకవర్గాల అభివృద్ది జరగాలన్నా, మళ్ళీ ఏదైనా ఎలక్షన్లలో గెలవాలన్నా మీరు పార్టీని కాపాడుకోండి.

మా తెలుగు తల్లి
ఈ మధ్య ఓ పత్రికలో ఇంగ్లీషులో పది లక్షల పదాలు చేరాయి అనే చర్చలో తెలుగులో ఎన్ని పదాలున్నై అనే విషయం ప్రస్తావించబడింది. కాని నా వుద్దేశంలో అందరూ తెలుగులో ఎన్ని పదాలున్నాయని లెక్కపెట్టడం మానేసి, ఎన్ని పదాలు పోగొట్టుకొంటున్నామో లెక్కపెట్టండి. మన పక్కింటి భాష తమిళంలోకి ప్రతి ఇంగ్లీషు పదానికి సరిఅయిన పదాలను సృష్టించి పదసంపదను పెంచుకుంటున్నారు. ఇంటర్నెట్టు, ఫ్యాక్సు లాంటి వాటికి కూడా తమిళ పదాలు వాడకంలో ఉన్నాయి. ఆ మధ్య మాలతీ చందూర్ గారు అరవల భాషాభిమానాన్ని గురించి స్వాతిలో ముచ్చటించారు. మమ్మీ డాడీ అని పిలిపించుకుని మురిసి పోయే అమ్మా నాన్నలు వున్నంత కాలం తెలుగు భాషకు చెదలు పట్టకుండా చూసుకోవాలి మనం!
మమ్మీ డాడీ అని పిలిపించుకునే తెలుగు మాతా పితలు తెలుగునేమి ఉద్ధరిస్తారయ్యా ?
మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని ఇంగ్లీషులో వ్రాసుకుని పాడే పిల్లల తల్లి దండ్రులయ్యా వీరు
డాలర్ల కోసం పరుగెత్తిన పుత్రసంతానాన్ని తల్చుకుని గర్వించే జీవులయ్యా వీరు
ఈ తెలుగు సాయంత్రం తేవాలి తెలుగు భాషా ప్రపంచానికి మరో ఉదయం!

Monday, June 8, 2009
అవినీతికి పునాదులు మనమే.
దేవుడు లేని చోటైనా వుంటుందేమో గాని అవినీతి లేని చోటు వుండదేమో! అవినీతి నిరోధక శాఖ వారికి రాజశేఖర రెడ్డి ఇచ్చిన ధైర్యం చాలా మెచ్చుకోగలిగిందే. వేయిమైళ్ళ ప్రయాణానికి మొదటి అడుగులాంటిది ఈ అడుగు. అవినీతి ఎక్కడెక్కడ పుడుతుందో అందరికీ తెలుసు. ప్రతి శాఖలో రక రకాలైన లైసెన్సులు ఇవ్వడానికి గాని, రెన్యువల్ చెయడానికి అయ్యే ఇతర ఖర్చులు అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రైవేటు కంపెనీలల్లోకూడా ఎంత అవినీతి పేరుకుపోయిందో చెప్పక్కర్లేదు. ఐటి కంపెనీ వుద్యోగాలకు బ్యాక్ డోరు పద్దతిలో చేరడం అంటే అందరికీ తెలిసిందే. కాస్త నీతిగా వుందామనుకునే వారు ఎలాంటి మానసిక వత్తిడికి లోనవుతుంటారో చెప్పక్కర్లేదు. కొన్ని శాఖల్లోనా నిజాయితీతో పని లేకుండా నా వాటా నీకు వచ్చి పడుతుంటే నా తప్పేమీ లేదనుకున్న వారు లేక పోలేదు. అయినా ఇచ్చే చేయి వుంటే కదా పుచ్చుకునే చేయి ముందుకు వస్తుంది.
మనలో ఎంతమంది ఏమీ ఇవ్వకుండా పని అయ్యే దారి (చట్టపరంగా) వుందా అనే ప్రయత్నం చేస్తారు చెప్పండి? అడిగే వాళ్ళని మేమెందుకు డబ్బులివ్వాలని అడిగే ధైర్యం మనకు లేదా? అప్పుడే మన టైమంతా వృధా అయిపోతున్నట్లు, అందుకే ఈ అడ్డ దారిలో వెళ్ళడం అవసరం అన్నట్లు ప్రవర్తిస్తాం. కాబట్టి ఒక్క రూపాయి కూడా అవినీతికి పునాది కాకుండా చూసే బాధ్యత మనదే అంటే అతిశయోక్తి కాదేమో!

Thursday, June 4, 2009
పద్మార్పిత గారి ఎందుకని కవిత స్ఫూర్తితో
మదిలోని విరహం
కనులలో నీరై కురవంగ
మెరిసే తారకలన్నీమసకబారుతూ కనిపింపంగా
వేసవిలో వీచే వడగాడ్పులైనా
శరదృతువులో వణికించే చలిగాడ్పులైనా
నా ఈ విరహాన్ని మరువనివ్వలేదు ఓ క్షణమైనా
చెదిరి పోలేదు నా ప్రేమ ఇసుమంతైనా.
ప్రేమైనా విరహమైనా
నాణానికి రెండు వైపులు,
పగలు రాత్రుల ప్రతిబింబాలు కాబోలు!
ఏది ఏమైనా ప్రేమామృతాల
విరహాగ్నుల కలబోతే గదా ఈ మనస్సు.
కనులలో నీరై కురవంగ
మెరిసే తారకలన్నీమసకబారుతూ కనిపింపంగా
వేసవిలో వీచే వడగాడ్పులైనా
శరదృతువులో వణికించే చలిగాడ్పులైనా
నా ఈ విరహాన్ని మరువనివ్వలేదు ఓ క్షణమైనా
చెదిరి పోలేదు నా ప్రేమ ఇసుమంతైనా.
ప్రేమైనా విరహమైనా
నాణానికి రెండు వైపులు,
పగలు రాత్రుల ప్రతిబింబాలు కాబోలు!
ఏది ఏమైనా ప్రేమామృతాల
విరహాగ్నుల కలబోతే గదా ఈ మనస్సు.
Subscribe to:
Posts (Atom)