కొత్త రాజధాని అంటూ హోరేత్తిస్తున్న చంద్రబాబుకు, ఆయన చుట్టూ ఉన్న మంత్రులకు ఒక విన్నపము.
కేవలం
పదమూడు జిల్లాల పరిపాలనకు అవసరమైన రాజధాని ఏర్పాటు చేసుకోవడానికి ఇంత
రాద్దాంతమెందుకు? కావలసిందల్లా ఒక అసెంబ్లీ, సెక్రటేరియట్, హైకోర్ట్ మరియు
కొన్ని ముఖ్యమైన ఆఫీసులు తప్ప ఇంకేం కావాలి? ప్రతి జిల్లాలోని ప్రతి మనిషి
రోజూ రాజధానికి రావలసిఉంటుంది అన్నట్లు లెక్కలు వేసి అందరికీ సమాన దూరంలో
ఉండాలి అంటూ అందుకు అనువైనది విజయవాడ ఒక్కటే అంటూ ముక్త కంఠంతో గొంతెత్తి
పాడటం ఆపేసి కాస్త స్థిమితంగా ఆలోచించండి!
అత్యాధునిక
సాంకేతిక సౌకర్యాలు అందుబాటులో ఉన్న ఈ యుగంలో మనిషి కదలకుండా అన్ని పనులు
చేసుకుంటున్న వెసులుబాటు ఉంటున్న ఈ రోజుల్లో ఇంకా సమాన దూరం అనే సిద్ధాంతం
అవసరం లేదు.
రాజధానికి
భూసేకరణ అంటూ రైతులను మభ్యపెడతారెందుకు? ఆది మానవ యుగం నుంచి తరతరాలుగా
వస్తున్నది వ్యవసాయం. కూడు, గుడ్డ, గూడు క్రమంలో మొట్టమొదటి కూడు మనందరికీ
అందించేది రైతులే ! ఎన్నో తరాలుగా చేస్తున్న ఆ వృత్తిని వారు వదలిపెట్టి
మరో వృత్తినో, వ్యాపకాన్నో చేపట్ట గాలుగుతారా? కోట్ల రూపాయలు వస్తాయన్న
ఆశలతో వారిని ముంచెత్తి బంగారంలాంటి భూములను కాంక్రీటు అరణ్యాలుగా
మార్చదలచారా?
భారత
దేశంలోనే అత్యంత సారవంతమైన భూభాగాలలో కోస్తా భూములు ఒకటని మీకు వేరుగా
చెప్పనక్కర లేదు. నీటి వసతులు, చక్కటి వాతావరణం, వరదల ద్వారా వచ్చే ఒండ్రు-
వీటన్నిటినీ
మించి
వ్యవసాయంలో నిష్ణాతులైన రైతులు పండిస్తున్న పంటలను గురించి ఆలోచించండి.
రాబోయే ఎన్నో తరాలు వ్యవసాయం చేసి పంటలు పండించాల్సిఉంది. ఆహారం మీద
ఖర్చులు పెరుగుతున్న ఈ తరుణంలో కోస్తా భూముల మీద కన్నేసి కోట్లు
దండుకోవాలనుకునే వారిని కట్టడి చేసి సాగు భూములను కాపాడండి. భవిష్యత్తులో
రాబోయే వారికి తిండి పెట్టండి.
Andharu alochinchali.. Matladali.
ReplyDeleteఅందరికి అర్ధం అయ్యింది వాళ్ళకి అర్ధం కాకుండా ఉండదు .
ReplyDeleteలేకపోతే నేషనల్ హైవే పొడుగునా అటు ఇటు కొంత దూరంలో రాజధ్హని నిర్మిస్తే ఇంత ఖర్చు అవదు . రైతుల భూములు తీసుకొని పెట్టినా రాజధాని గా ఎవరు పట్టించుకొంటారు . హైదరాబాద్ పెరగడానికి కారణం అక్కడ ముందునుంచి ఉన్న హ్యూమన్ రిసోర్సెస్ తప్ప ఇంకోటి కాదు .కెవలమ్ అసెంబ్లీ ,సచివాలయం కి ఎంత మందికి అవసరం ఉంటుంది .
విజయవాడ కి పెరుగుదల కి ఏ రాజకీయ నాయకుల అవసరం లేదు ,కాని ఎక్కడ పెట్టినా ప్రజలు గుంటూరు ,విజయవాడ వదిలి మీరు కట్టే రాజధాని కి ఎందుకు వస్తారు ఽఅ అవసరం ఎంతమందికి ఉంటుంది . లక్ష ఎకరాలు ,కోట్ల రూపాయలు పెట్టి రాజధాని నగరం లో అభివ్రిద్ది ఏమి చేస్తారు . విజయవాడ ,గుంటూరు దగ్గరలో లేని ఏ కొత్త వసతులు మీకు
రాజధాని లో అవసరం అవుతాయి .సింగపుర్ తో పోల్చుకొంటే ఎవరైనా అక్కడ చదువులు తో పోల్చుకోవాలి . మొత్తం కలిసి 400 మంది రాజకీయ నాయకుల కుటుంబాలు ,
ఒక 1000 మంది ఉద్యోగస్తులు ,ఇంకో 1000 మంది వారి మీద ఆధారపడే వారు మొత్తం కలిపినా ఒక చిన్న పల్లెటూరు అంత మంది ఉంటె మీకెందుకు అక్కడ అన్ని రోడ్లు ,స్చూల్లు ,
మొఅదలైనవి . రాజధ్హని గా చెప్పిన చోటనుండి 20 కిలోమీటర్ల లోపు అన్ని ,అంతకంటే ఎక్కువ సౌకర్యాలు ఉంటె అక్కడ ఎవరి కోసం అభివ్రిద్ది చేస్తారు . కోస్తా ప్రజలు హైదరాబాద్ వెళ్ళింది 1982 తరువాత ,అది కూడా అక్కడ చౌకగా భూములు ,కొంత అమాయకం గా పంచేసే మనుషులు ఉన్నారని . ఇక్కడ ఏ పరిశ్రమ పెట్టడం కుదరని పని . ఉన్న రోడ్లు ,స్తలాలు , ఆఫీసులు (బందరు రోడ్ లో ) కాదని ఎక్కడో ఇంత ఖర్చు పెట్టడం మంచిది కాదు . 13 జిల్లాలు పరి పాలించడానికి ఇంత హడావుడి అవసరమా . ఎవరన్న అడిగితే ప్రతిపక్షం అని తిడతారు కాని ఎవరు పని వారిదే .కేంద్రం నుండి డబ్బులు రావాలంటే ఏ దైనా పది కాలాలు పేరు చెప్పుకోనేట్లు ,రాబోయే తరాలకి పని కల్పించే పని చెయ్యాలి కాని ఇది కాదు.
కేవలం 13 జిల్లాలు కాదండి. ఇది 5 కోట్ల ఆంధ్రుల రాజధాని అనే స్పృహ ఉండాలి. రాజధాని అంటే అసంబ్లీ మాత్రమే అనే వారు ముందుగా రాష్ట్రం -విధులు, నగరం- విస్తరణ, పట్టణ ప్రణాళిక వంటి విషయాలు తెలుసుకోవాలి . చులకన చూపుతో తెలిసి తెలియని జ్ఞానం తో వ్యాఖ్యానం చేయటం మంచిది కాదు. అది హైదరాబాద్ లా అస్తవ్యస్త మహా నగరం కాకూడదనే ముందు చూపు తో సరైన పట్టణ ప్రణాళిక రూపొందించుతున్న వారికి వీలైతే మంచి సలహాలు ఇవ్వండి. భూ సేకరణ అనేది అందరికి మంచి కొరకు ఎంచుకొన్న పధకం. అయితే రాజధాని అయితే తమ పొలాలు రియల్ ఎస్టేట్ వాళ్లకు ఇచ్చి గజాల లెక్కన అమ్మితే నాలుగింతలు డబ్బు వస్తుందని అత్యాస పరులకు కడుపు మంట గానే ఉంటుంది.
ReplyDeleteఇకపోతే పచ్చని పంట పొలాలు అన్నారు. అక్కడ సేకరణ చేసే భూమిలో దాదాపు 80 శాతం మెట్ట భూమి అని, వాటిలో కొన్ని వరద ముంపు చేలు అని తెలుసుకొని వ్యాఖ్యానిస్తే బాగుండేది. పంట పండించే రైతులు ధర లేక చాలా ప్రాంతాలలో వరి పండించటం మానిన సంగతి తెలిస్తే మీలాంటి స్వార్ద వాదుల తిండికి డోకా లేదన్న విషయం అర్ధం అవుతుంది, ఇక్కడ సాగు ఆగితే ఇదే బకింగ్ హం కాలువ కింద నీరు అందని పొలాలు రెట్టింపు పరిణామం లో ఉన్నాయన్న విషయం ఇక్కడికి వచ్చి చూచి తెలుకొండి.
పచ్చ కామెర్ల వాడికి లోకమంతా పచ్చగానే ఉన్నట్లు లక్షల కోట్లు దండుకొన్న వారికి వారిని నిస్సిగ్గుగా బలపరిచే వారికి ప్రతి పనిలోనూ కోట్లు దండుకోవటమే తెలుసు, ఇలాంటి పోకడల వల్లే ఆంధ్రులు చులకన అయారన్న సంగతి తెలుసుకోండి.
అలాగే రైతులు - రైతు కూలీలు తరతరాలుగా అలాగే బ్రతకాలనటం మానవత్వం అనిపించుకోదు. ఇప్పటికే చాలా మంది రైతులు వ్యవసాయం వదిలి ఇతర వ్యపకాలలోకి వెళ్ళారు. రైతు కూలిలె కౌలు రైతులుగా మారి పంటలు పండించి , వాటికి గిట్టు బాటు ధర రాక కొండకచో ఆత్మహత్యలకు పాల్పడుచున్న వైనం మనం ఎరిగినిదే. సరుకు లభ్యత ఎక్కువ ఉంటె ధర తక్కువ అన్న వ్యాపార సూత్రం అర్ధం అయితే పంట పొలాలు పోతున్నాయన్న ఏడుపు రాదు