Saturday, May 16, 2009

చిరంజీవిగారూ!

నిన్న ఎలక్షన్ల ఫలితాలను విశ్లేషిస్తూ చిరంజీవి సమయం సరిపోలేదు అని ఓ మాట అన్నారు? రాజకీయాల్లోకి రావాలా వద్దా అంటూ కాలాయాపన చేసిందెవరు? ఏ పేరు పెట్టాలా అని రోజులు గడిపింది ఎవరు? మీటింగ్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ, వలస పక్షులకోసం ఎదురుచూస్తూ, మీటింగులకు వచ్చే వాళ్ళంతా వోట్లేస్తారన్న భ్రమలో వుండిదెవరు?
అయ్యా, రామారావు రాజకీయాల్లోకి వచ్చిన నాటి పరిస్థితి వేరు అని అందరు చెప్తున్నా విన్నారా? మీరు చేసిన సర్వేలు నిజాన్ని మీకు చెప్పాయా? మేధావుల మాటలు ప్రక్కన బెడితే ఏం జరుగుతుందో మీరే కాదు, కేసీయార్ సైతం ఇంకా నేర్చుకో లేదు. వెళ్ళిపోయిన వారి మీద అభాండాలు వేసారు గాని వాళ్ళు చేసిన విమర్శలను పట్టించుకున్నారా? వుట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్న సామెత వూరకే పుట్టలేదు మరి! ఇప్పుడైనా ఎవరు మనవారు అని ఆలోచించండి.
విశ్లేషణలు అని మరీ కాలయాపన చేయకండి?

8 comments:

  1. allu aravind gaadini praja rajyam party nunchi tholaginchaka pote praja rajyam partyki maa abhimaanulam andharam dhooram gaa vuntam.

    ReplyDelete
  2. This comment has been removed by the author.

    ReplyDelete
  3. చిరంజీvi గురించి రాస్తూ మీరు ఇంకా టైం వృధా చేస్తున్నారు. అసలికి చిరంజీవె, అల్లు అరవింద్ లే తెలుగు దేశం పార్టిని ఓడించిటానికి కాంగ్రెస్ పార్టి పెట్టిన పెద్ద కోవర్ట్లు లాగున్నారూ. వారిని నమ్మి పి.ఆర్.పి. లో చేరిన ప్రతి ఒక్కరు ఒక్క వంగ గీత తప్ప అందరూ ఓడి పోయారు. అరవింద్ మీద అన్ని అభాండాలు వేస్తున్నా ఏ ఒక్క రోజు కూడా చిరంజీవి ఆయనను మందలించ లేదు. He behaved as if he those rumars were all wrong.

    ReplyDelete
  4. Chiru is Great.. He will put Allu aravind aside... He will prepare well for next election

    ReplyDelete
  5. టెక్నాలజీ గారు చెప్పినట్లు జరుగుతుందని ఆశిద్దాం.

    ReplyDelete
  6. నేను అనుకునంత అయింది. వలస వచ్చిన వాళ్ళకు అదికంగా టికెట్ ఇచ్చారు, దాని ఫలితం అనుభవించారు. ఇది జరగాల్సిందే. చిరు రాజకీయాల్లోకి రావాలని కోరుకున్నవాళ్ళలో నేను వకడిని. చిరు రాజకీయాల్లోకి వచ్చారు కానీ పాటించాల్సిన నియమాలు తుంగలో తొక్కారు. మార్పూ అన్నారు కానీ చేసింది సున్యం. వలస వచ్చిన వారికీ అధిక ప్రాధాన్యం ఇచ్చారు. అక్కడే పరాప విజయానికి బీటలు వారాయి. ఉదాహరణ చెప్పాలంటే మాది బి.కొత్త కోట . తంబళ్ళపల్లి నియోజక వర్గం . అక్కడ కాంగ్రెస్ పార్టి నాయకుడు కలిచెర్ల ప్రభాకర్ రెడ్డి సొంత పార్టి లో టికెట్ తగ్గక పోవడంతో రాత్రికి రాత్రి పరాప లో చేరి పోయారు. విచిత్రం ఏమిటంటే చేరిన రెండు రోజుల్లోనే ఆయనకు చిరు గారు టికెట్ కేటాయించేసారు. అది మాకు ( చిరు అభిమానులు ) ఆగ్రహం తెప్పించింది, ఫలితం పార్టి కోసం ఎవరు పనిచేయలేదు . ఇక్కడ పరాప కు పనిచేసిన వాళ్ళు కులం అధారంగా బలిజ కులం మాత్రమే పని చేసింది. ఇది సంగతి. గోడ దుకు నాయకులకు మంచి బుద్ది చెప్పారు ఇక్కడి ప్రజలు.
    పార్టి లో అల్లు అరవింద్ పెత్తనం ఎంతవరకు సబబు. మహా మహుల్ని పక్కన పెట్టి పెత్తనం మొత్తం అల్లు అరవింద్ గారికి అప్పగించారు. ఫలితం అనుభవించారు. మమ్మల్ని బాధ పెట్టారు. అందుకే మేమంతా కాంగ్రెస్ కు వోటేసాం. ఇక వచ్చే ఎలెక్షన్ లో నైన చిరు పార్టి కి సరైన నాయకత్వం వహించి పార్టి కి ముందుకు తీసుకో పోవాలని అసిస్దాం.

    ReplyDelete