Wednesday, November 4, 2009

vaasthu

అయ్యా, ఈ వాస్తు పిచ్చి ఎయిడ్స్ కన్నా దారుణంగా వ్యాపిస్తోంది. చివరికి పెళ్ళాం పక్కన ఎడమ వైపునో లేదా కుడివైపునో కూర్చుంటేనో వాస్తు అంటే నమ్మేంత మూర్ఖత్వం మనలో పేరుకు పోతోంది. వాస్తు విరుద్ధంగా కట్టిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి.  ప్రాచీన కాలంలో విడి విడిగా ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఒకరి ఇంటి బావికి మరో ఇంటి బావి దూరంగా ఉంటే ఊటలు సక్రమంగా ఉంటాయనో, వంట గదుల్లోకి గాలీ వెలుతురు బాగా రావాలని, ఒకరి వంటింటి పొగ ఇంకొకరి వంటింట్లోకి రాకూడదనో ఈ నియమాలు పాటించడం జరిగింది. మరి టాయిలెట్లు ఇంట్లో ఉండొచ్చని వాస్తులో ఉందా?

1 comment:

  1. మంచి ప్రశ్న వేశారు. ఇరవై ఏళ్ళ క్రితం శ్రీకాకుళంలో, 15 ఏళ్ళ క్రితం కరీంనగర్ లో చాలా మంది ఇంటి వెనుక బాత్ రూంలు, లెట్రిన్ లు కట్టేవాళ్ళు. ఇప్పుడు కూడా పల్లెటూర్లలో అలాగే కడతారు. ఇంటి లోపల అటాచ్డ్ బాత్ రూంలు మొట్టమొదట చూసినది వైజాగ్ లో, 1993లో మా బంధువులు అపార్ట్మెంట్ లో అద్దెకి దిగినప్పుడు. వైజాగ్ లో అపార్ట్మెంట్ లు ఎక్కువగా ఉండడం వల్ల అటాచ్డ్ బాత్ రూంల మీదే ఆధారపడుతుంటారు. ఇప్పుడు మీడియం లెవెల్ టౌన్స్ లో కూడా అపార్ట్మెంట్లు కడతున్నారు, అది కూడా వాస్తు ప్రకారం.

    ReplyDelete