దాదాపు పదిహేనేళ్ళ క్రితం అనుకుంటాను, బాలు గారు క్రొత్త గళాల కోసం ఈ టీవీలో పాడుతా తీయగా కార్యక్రమాన్ని రూపొందించి మొదలు బెట్టారు. వసంత ఋతువులో కోకిలలు లేత మావి చిగురులు తిని కూస్తున్నట్లు ఎన్నో క్రొత్త క్రొత్త గొంతులు పాడుతుంటే చాలా ఆనందంగా ఉండింది. బాలు గారు వారు చేస్తున్న చిన్న చిన్న తప్పులను సున్నితంగా ఎత్తి చూపిస్తూ సూచనలు చేస్తూంటే, వజ్రాల కోసం జల్లెడ పడుతున్న అన్వేషి గుర్తుకు వచ్చాడు. ప్రతి పాటకు ఆయన చెప్పే వ్యాఖ్యానం అందరికీ ఒక సింహావలోకనంగా వుండేది.
ఇంకా ....మరోసారి
No comments:
Post a Comment