Sunday, September 11, 2011

గోదావరి మజిలీ



గల గల పారుతూ వచ్చిన గోదావరి 
రాజమండ్రి రాగానే నిదానమై, నిశ్సబ్దంగా 
నన్నయ వ్రాసిన భారతాన్ని వింటూ 
వంతెనల మీద పరిగెత్తే రైళ్ళను, బస్సులను 
చూస్తూ నెమ్మదిగా ధవలేశ్వరాన్ని దాటి 
పాయలుగా చీలి పచ్చని పొలాలలో 
బంగారం పండిస్తూ సాగరమాత గర్భంలో చేరుకొని 
సేద దీరుతుంది కాబోలు!

3 comments:

  1. మన గోదావరి గురించి గోదావరి అంత అందంగా చెప్పారు,ధన్యవాదాలు!

    ReplyDelete
  2. అందంగా చెప్పారు....బాగుంది!

    ReplyDelete