నిన్న ప్రసారం అయిన పాడుతా తీయగా ఒక ఆణి ముత్యం అనే చెప్పుకోవాలి. మానస వీణా మధుగీతం మరియు మ్రోగేనా ఈ వీణ పాడిన దామిని , సాయిరమ్యలు అందరినీ వెనకటి రోజులకు తీసుకెళ్ళి పోయారంటే అతిశయోక్తి కాదేమో!ముఖ్యంగా సాయిరమ్య పాడుతున్నపుడు కళ్ళలో నీళ్ళు రాని వారు ఉండి ఉండరేమో!
మానస వీణ పాటను ఆ రోజుల్లో క్యాసెట్టులో ఒకే వైపు నాలుగైదు సార్లు రికార్డు చేసుకుని ఎన్నో సార్లు విన్నాను నేను.
బాలు గారు చేస్తున్న ఈ కార్యక్రమం ఎటువంటి నాటకీయత లేకుండా స్వచ్చంగా మరియు అందరి మన్ననలను పొందుతూ కలకాలం సాగిపోతున్దాలని ఆశిద్దాం!