సూరి వారి ఇంట కాలిడిన నేను
కలగన్నాను ప్రపంచమంతటా
చూస్తానని.
కళ్ళు తెరిచినా మూసినా ఏమీ
కనబడదు అనుకోలేదు నేను.
తోటి కార్లు రివ్వున రివ్వున
రోడ్డు మీద వెళ్తుంటే
కారు నలుపు కవరులోన
కుమిలి పోవలసిందేనా నేను.
ఈ కారు బ్రతుకు ఇంత
ఘోరమనుకోలేదు నేను.
బంగారు పంజరంలోని
పక్షి కన్నా హీనంగా
బ్రతుకుతున్నాను నేను.
ఆల్టో లక్ష్మణా అనుకుంటూ!
No comments:
Post a Comment