రాజధాని ఏర్పాటు సందర్భంగా రైతులను జీవితాంతం వ్యవసాయమే చేసుకోవాలనుకుంటున్నారా ? అని అడిగిన చంద్రబాబు గారి గురించి ఏమనుకోవాలి? తరతరాలుగా ఆ వృత్తినే నమ్ముకుని కుటుంబ జీవనం సాగిస్తున్న వారిని అడగాల్సిన ప్రశ్న అదేనా? ఎందుకో వ్యవసాయం అంటే బాబు గారికి చిన్న చూపే. అయినా వ్యవసాయం దండగ అన్నది ఆయనే గదా! వారి జీవితాలలో ఏదైనా మంచి మార్పులు తీసుకు రావాలనుకుంటే వారి పంట ఉత్పత్తులకు మంచి ధరలు కల్పించి, వారికి మంచి ఆదాయం లభించేఐ ఎన్నో పనులు చేయ వచ్చు గదా! ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేటట్లు చేసి వారికి చక్కని రాబడి అవకాశాలు కల్పించవచ్చు గదా! బాబు గారి ఉద్దేశ్యంలో వ్యవసాయం చేయడం ఒక నైపుణ్యం అంటే స్కిల్ కాదా? వీరందరినీ కొత్త రాజధాని ఏర్పడ్డాక పారిశ్రామిక వేత్తలుగా తయారు చేస్తాననడం హాస్యాస్పదంగా ఉంది!
అసలు సింగపూర్ ను ఎందుకు ఆదర్శంగా తీసుకోవాలి? అక్కడ స్థలాభావం వల్ల ఆకాశ హర్మ్యాలు కట్టుకోవలసి వచ్చింది అన్న విషయం అందరికీ తెలుసు. మలేసియా నుండి నీళ్ళు తెచ్చుకోవాల్సిన గతి వాళ్ళది. అక్కడఏ ఫ్యాక్టరీలులేవన్న విషయం అందరికీ తెలుసు. సింగపూర్ ఒక ఆర్ధిక శక్తిగా ఎదగడానికి మాత్రమె వారికి అవకాశాలు మెండు. ఒక షిప్పింగ్ కేంద్రంగా మరియు టూరిస్ట్ సిటీగా అభివృద్ధి చెందింది అనడంలో ఆశ్చర్యం లెదు. అక్కడ వ్యవసాయానికి తావే లెదు. మరి ఎ రకంగా బాబు గారు సింగపూర్ ను ఆదర్శంగా చెబుతున్నారు?( ఇంకా ఉంది)