ఈ శిల్పాలలో నిదురించేనో ఏ శిల్పి మధుర స్వప్నాలు
ఈ మూగవోయిన శిథిలాలలో వినిపించేనో ఏ వీరగాథలు
ఈ శిలలయందు కరడు గట్టెనో ఏ వీర వనితల భగ్న హృదయాల వేడి నెత్తురు
ఈ నాట్యశిలపై కందెనో ఏ రాజనర్తకి కోమల పాద పద్మంబులు
ఈ సింహ ద్వారంబులే చాటెనో ఏ వీర సింహుల రణవిహారాలు
ఈ మట్టిలో క్రుంగెనో ఏ మహీశుల నిండు జీవితాలు
ఈ సభా వేదికపై మోకరిల్లిరో ఏ పరాజితులు
ఘూర్ణిల్లెనో ఇట ఏ సింహ నాదంబులు
మారు మ్రోగెనో ఏ విజయ దుందుభీలు
కలాంగనల కానుకలే కాలవాహినిలో కలిసిపోవ
మిగిలినా ఈ ముత్యేపు చిప్పలు అరుణ సంధ్యా కాంతులై
Friday, August 28, 2009
Monday, August 24, 2009
ఎన్నాళ్లకొచ్చావే ఓ వానా !
అయ్యా చంద్ర బాబు గారూ, దాదాపు ఓ పది రోజులుగా రాష్ట్రంలో ఓ మాదిరి నుండి భారీగానే వర్షాలు కురుస్తున్నాయి గదా! ఇంకా మీరు కరువంటూ ఎందుకు అరుస్తున్నారు? ఓ నెల పైగా వర్షాలు లేనందువల్ల ఇంచుమించు కరువు ఏర్పడుతుందేమో అన్న తరుణంలో వర్షాలు రావడం, పరిస్థితులు కొంత వరకు మారడం జరిగింది కదా! తమ తమ పొలాల్లో నీళ్లు చూసాక ఏ రైతూ వూరుకోడు. మళ్ళీ ఎలాగైనా ఏదో పంట వేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అందుకు తోడ్పాటుగా మీరు రైతులకు కావలసినవి అందేటట్లు ప్రయత్నం చేయండి. మీరు ఈ దిశగా ఆలోచించండి. మీకు బోధపడుతుంది.
Saturday, August 15, 2009
మిత్రుడి అకాల మరణం
ఇటీవల నా చిరకాల మిత్రుడు కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది కర్నూలు ఊరి బయట రాత్రి సుమారు పది గంటలకు నేషనల్ హైవేలో ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడం, కారు దానికి గుద్దుకోవడం, నా మిత్రుడు( కారు నడుపుతున్నవాడు) అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కారులో వున్న ఇంకా ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ బస్సులో నుంచి దిగిన వాళ్ళెవ్వరూ ఏ అంబులెన్సు కోసమో ప్రయత్నించలేదు. దిగిన వాళ్ళలో ఎవరో సెల్ఫోన్లు, మెడలో వున్న నగలు కొట్టేసారు. ఓ గంట తర్వాత దారిన పోతున్న ఓ డాక్టరు దంపతులు ఒక అంబులెన్సు తెప్పించి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ ఇద్దరినీ హాస్పిటలుకు తరలించారు. ఇది మనం ప్రదర్శిస్తున్న మానవత్వానికి ఒక మచ్చు తునక. ప్రక్క వారిని పట్టించుకోని మనం, మనకో మన వాళ్ళకో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదనివాపోతుంటాము.
Thursday, August 13, 2009
దేవేందర్ గౌడ్ గారూ
మీరు తెలుగు దేశాన్ని వదలి వెళ్ళడం, నవ తెలంగాణా పార్టీని స్థాపించడం, కొంత హడావిడి చేయడం( కార్ల నెంబర్లను మార్చడం వంటివి), చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించగానే అటువైపు దృష్టి సారించడం, మీ నవ తెలంగాణా పార్టీని అందులో విలీనం చేయడం, రెండు స్థానాల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చెయ్యడం, చిత్తుగా ఓడిపోవడం -- ఇవన్నీ గమనిస్తే మీకు మీ సత్తా ఏమిటో తెలిసివచ్చే వుంటుంది.
చిన్న చితకా పార్టీలే తమ అపజయానికి మూలం అని నమ్ముతూ వాటిని నిర్వీర్యం చేసే పనిల్లో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు.ఈ సందర్భంలోనే వారు మిమ్మల్ని రమ్మని పిలవడం జరిగిందేమో! అదే అదనుగా పాత గూడే పదిలం అన్న చందాన కార్యకర్తల అభీష్టం అంటూ చిరంజీవిని ఒంటరివాడుగా చేస్తూ వెళ్ళిపోయిన వారి బాటలోనే మీరూ ప్రజారాజ్యం పార్టీని వదలి వెళ్ళడం జరిగింది.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చారిత్రిక తప్పిదం అనే మాటను పదే పదే వాడుతున్నారు. ఇదెంతవరకు ఉచితం? మీరు చెప్పే చరిత్ర ఏమిటి? మీ చరిత్రకు ఇది ఎలా వర్తిస్తుంది?
తమ్ముడు తమ్మినేని తమ దారిలోనే ఎగిరి వచ్చేశాడు. ఇక మిగిలింది ప్రజారాజ్యం ఎమ్మెల్యేలే! వారిని తీసుకు వచ్చే బృహత్కార్యాన్ని మీరిద్దరూ చేపడతారేమో ! అందరినీ జీరోలుగానే వుంచే ఏకైక నెంబర్వన్ చంద్రబాబు బహు గొప్పవాడు సుమా ! ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలు వుంటే ఏర్పడే సంఖ్య అంత పెద్దది కదా !

Friday, August 7, 2009
మా తాత గారు మరణించినప్పుడు మా నాన్నగారుశిరాకి (శివరామకృష్ణ) వ్రాసినది.
ఒక మహోన్నత జీవితమే ముగిసెనో ఈ మంటలలో
ఒక కరుణార్ద్ర హృదయమే కరగెనో ఈ కాలెడి చితిలో
ఒక ధీరచిత్తుని ఆశయాలే అడుగంటెనో ఈ క్షితిలో
దేవుడు ఎటులుండునో ఎరుంగము మేము
వెలసిన వేయి ఆలయాలలోనో, పొగచూరిన కటిక రాతి రూపాలలోనో
కాని కన్నతండ్రివి నీవు, మాకు కన్పించిన దైవానివి నీవు.
పెరిగితిమి పెద్దలై కాఠిన్యం ఎరుగని నీ కనుసన్నలలో
నేర్చితిమి విద్యాబుద్ధులు నీ చేయూతలలో నిలద్రొక్కి.
నీతిపథములో నడచితిమి నీ కాలి జాడలలో.
నీ ఆశలే మా ఆశయాలు, నీ భావములే మా బాటలు.
కనుల నీరు క్రమ్మంగ కరగిన చిత్తములో ఉద్భవించెను ఈ ఊహలు.
లేవిక నీవు మాకిక నీ భౌతిక రూపాన
కాని వున్నావు నీవు నీ విశ్వరూపాన.
అరుణ సంధ్యా కాంతియే నీ మేనిచ్చాయయై
కొలనుల కలువలే నీ కనులై
నీలిగిరుల హిమమకుటమే నీ నిర్మల భావాలై.

Wednesday, August 5, 2009
పాపం శ్రీనివాస యాదవ్
శ్రీనివాస యాదవ్ గారూ, దేవేందర్ గౌడ్ గారి విషయంలో చంద్రబాబు గారు మీ సలహా పాటిస్తారని మీరు ఎలా భావిస్తారండీ? ఈ రోజు దేవేందర్ గారు అవసరమైనట్లే, మరో రోజు మీరు కూడా చంద్రబాబు గారికి అవసరమవుతారులెండి.
చంద్రబాబు గారి నైజం తెలిసిన మీరెందుకు తొందరపడి రాజీనామా చేస్తారు?
సమైక్య పార్టీ ఏమైనా స్థాపిస్తారా? చివరికి రాజీ పడతారా? ఒక విషయం గుర్తుంచుకోండి. చంద్రబాబు అందరినీ జీరోలుగానే వుంచుతాడు. ఎందుకంటే జీరోకు విడిగా విలువ లేదు. కాని ఏ అంకెకు ప్రక్కన వుంటే ఆ అంకె విలువ చాలా ఎక్కువగా పెరుగుతుంది. చంద్రబాబు అటువంటి అంకెలాంటి వాడు. అందరినీ జీరోలుగా వుంచి తన విలువ పెంచుకుంటూ వుంటాడు.
మహా కూటమి మాయగాడు ఆయన సుమా!

నా పాత కవిత (1965 )
మోసపు వేషాల వారికి
రాజకీయమే మోక్షమురా!
దేశ క్షేమం అంటారురా
దేహక్షేమం చూసుకుంటారురా!
చెప్పేది చేయరురా
చేసేది చెప్పరురా!
సత్యానికి అర్థం లేదురా
వాగ్దానాలకు విలువ లేదురా!
స్వాతంత్ర్య నాయకులమంటారురా
స్వార్థనాయకులయిన వీళ్ళురా!
పదవులకు పట్టిన త్రుప్పురా వీరు
పదపదరా! వదలగొట్టారా ఈ త్రుప్పును!
రాజకీయమే మోక్షమురా!
దేశ క్షేమం అంటారురా
దేహక్షేమం చూసుకుంటారురా!
చెప్పేది చేయరురా
చేసేది చెప్పరురా!
సత్యానికి అర్థం లేదురా
వాగ్దానాలకు విలువ లేదురా!
స్వాతంత్ర్య నాయకులమంటారురా
స్వార్థనాయకులయిన వీళ్ళురా!
పదవులకు పట్టిన త్రుప్పురా వీరు
పదపదరా! వదలగొట్టారా ఈ త్రుప్పును!
Monday, August 3, 2009
నా పాత కవితలు (1965 )
ముగిసిపోకుమా ఓ చల్లని రాతిరీ!
చందమామ చల్లదనంలో
ఒకటైన వలపు హృదయాలను
చెదరనీకుమా ఓ రాతిరీ!
నిద్రాదేవి ఒడిలో
కస్టాలు మరచిన నిరుపేదలకు
మెలకువ రానీయకుమా ఓ రాతిరీ!
పేదల నెత్తురు తాగే
పరమ రాక్షసులను
లేవనీకుమా ఓ రాతిరీ!
కండలు పిండి చేసే కార్మికులను
కాస్త నిదురైన పోనివ్వు ఓ రాతిరీ!
చందమామ చల్లదనంలో
ఒకటైన వలపు హృదయాలను
చెదరనీకుమా ఓ రాతిరీ!
నిద్రాదేవి ఒడిలో
కస్టాలు మరచిన నిరుపేదలకు
మెలకువ రానీయకుమా ఓ రాతిరీ!
పేదల నెత్తురు తాగే
పరమ రాక్షసులను
లేవనీకుమా ఓ రాతిరీ!
కండలు పిండి చేసే కార్మికులను
కాస్త నిదురైన పోనివ్వు ఓ రాతిరీ!
Saturday, August 1, 2009
ఏం జరుగుతోంది చిరంజీవి గారూ ?
చిరంజీవి గారూ? ఏమి జరుగుతోంది? ఒక్కొక్కరే బయటికి వెళ్లడానికి తయారవుతున్నారు. ప్రజారాజ్యం సినిమా సగం చూసి ఇంటర్వెల్లో జనం వెళ్లి పోతున్నట్లుంది. ఇక వున్న ఎమ్మెల్యేలనైనా కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టండి. వాళ్ళూ వెళ్ళే ప్రయత్నాల్లో పడ్డారంటే మాత్రం జనం వాళ్ల జన్మలో సినిమా వాళ్లకు ఓట్లు వేయరు. రాజకీయం వేరు, సినిమాలు వేరు అనేది సినిమా వాళ్లు ఇప్పటికైనా తెలుసుకోవలసిన సత్యం.
Subscribe to:
Posts (Atom)