Saturday, August 15, 2009

మిత్రుడి అకాల మరణం

ఇటీవల నా చిరకాల మిత్రుడు కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది కర్నూలు ఊరి బయట రాత్రి సుమారు పది గంటలకు నేషనల్ హైవేలో ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడం, కారు దానికి గుద్దుకోవడం, నా మిత్రుడు( కారు నడుపుతున్నవాడు) అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కారులో వున్న ఇంకా ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ బస్సులో నుంచి దిగిన వాళ్ళెవ్వరూ ఏ అంబులెన్సు కోసమో ప్రయత్నించలేదు. దిగిన వాళ్ళలో ఎవరో సెల్ఫోన్లు, మెడలో వున్న నగలు కొట్టేసారు. ఓ గంట తర్వాత దారిన పోతున్న ఓ డాక్టరు దంపతులు ఒక అంబులెన్సు తెప్పించి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ ఇద్దరినీ హాస్పిటలుకు తరలించారు. ఇది మనం ప్రదర్శిస్తున్న మానవత్వానికి ఒక మచ్చు తునక. ప్రక్క వారిని పట్టించుకోని మనం, మనకో మన వాళ్ళకో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదనివాపోతుంటాము.

5 comments:

  1. అయ్యో. జరిగింది ఘోరం. కనీసం 108కు ఫోన్ చేస్తారే ఎంత తెలియనివారయినా? చెయ్యకపోవడం అమానుషమే.

    ReplyDelete
  2. ఏంటొ ఒక్కోసారి ఇలాగే అవుతుంది, అసలు మనమెందుకున్నామో ఈ భూమ్మీద అనిపిస్తుంది.

    ఈ మనస్తత్వాల్ని మార్చడానికి మనమేదన్న చెయ్యగలమా ??

    ఎందరో మహానుభావులు..దయయుంచి అందరూ కాస్త ఆలోచించరూ !!

    ReplyDelete