Thursday, August 13, 2009

దేవేందర్ గౌడ్ గారూ

మీరు తెలుగు దేశాన్ని వదలి వెళ్ళడం, నవ తెలంగాణా పార్టీని స్థాపించడం, కొంత హడావిడి చేయడం( కార్ల నెంబర్లను మార్చడం వంటివి), చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించగానే అటువైపు దృష్టి సారించడం, మీ నవ తెలంగాణా పార్టీని అందులో విలీనం చేయడం, రెండు స్థానాల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చెయ్యడం, చిత్తుగా ఓడిపోవడం -- ఇవన్నీ గమనిస్తే మీకు మీ సత్తా ఏమిటో తెలిసివచ్చే వుంటుంది.
చిన్న చితకా పార్టీలే తమ అపజయానికి మూలం అని నమ్ముతూ వాటిని నిర్వీర్యం చేసే పనిల్లో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు.ఈ సందర్భంలోనే వారు మిమ్మల్ని రమ్మని పిలవడం జరిగిందేమో! అదే అదనుగా పాత గూడే పదిలం అన్న చందాన కార్యకర్తల అభీష్టం అంటూ చిరంజీవిని ఒంటరివాడుగా చేస్తూ వెళ్ళిపోయిన వారి బాటలోనే మీరూ ప్రజారాజ్యం పార్టీని వదలి వెళ్ళడం జరిగింది.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చారిత్రిక తప్పిదం అనే మాటను పదే పదే వాడుతున్నారు. ఇదెంతవరకు ఉచితం? మీరు చెప్పే చరిత్ర ఏమిటి? మీ చరిత్రకు ఇది ఎలా వర్తిస్తుంది?
తమ్ముడు తమ్మినేని తమ దారిలోనే ఎగిరి వచ్చేశాడు. ఇక మిగిలింది ప్రజారాజ్యం ఎమ్మెల్యేలే! వారిని తీసుకు వచ్చే బృహత్కార్యాన్ని మీరిద్దరూ చేపడతారేమో ! అందరినీ జీరోలుగానే వుంచే ఏకైక నెంబర్వన్ చంద్రబాబు బహు గొప్పవాడు సుమా ! ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలు వుంటే ఏర్పడే సంఖ్య అంత పెద్దది కదా !

No comments:

Post a Comment