ఈ శిల్పాలలో నిదురించేనో ఏ శిల్పి మధుర స్వప్నాలు
ఈ మూగవోయిన శిథిలాలలో వినిపించేనో ఏ వీరగాథలు
ఈ శిలలయందు కరడు గట్టెనో ఏ వీర వనితల భగ్న హృదయాల వేడి నెత్తురు
ఈ నాట్యశిలపై కందెనో ఏ రాజనర్తకి కోమల పాద పద్మంబులు
ఈ సింహ ద్వారంబులే చాటెనో ఏ వీర సింహుల రణవిహారాలు
ఈ మట్టిలో క్రుంగెనో ఏ మహీశుల నిండు జీవితాలు
ఈ సభా వేదికపై మోకరిల్లిరో ఏ పరాజితులు
ఘూర్ణిల్లెనో ఇట ఏ సింహ నాదంబులు
మారు మ్రోగెనో ఏ విజయ దుందుభీలు
కలాంగనల కానుకలే కాలవాహినిలో కలిసిపోవ
మిగిలినా ఈ ముత్యేపు చిప్పలు అరుణ సంధ్యా కాంతులై
బాగుందండి.
ReplyDelete