Tuesday, November 17, 2009

Kanulaku vindu

కనులకు విందు  Photo courtesy: Vaarttha Photo Gallery

  sheena-4

నీలికొండలు నింగినంటగా
పండిన   వరిచేలు గాలివాలుకు తలలూపగా
పసిమిరంగులోన మెరిసిపోతున్న ఈ సుందరి
మదిలోన మెదులుతున్న తలపులతో
మైమరచి కనులు మూసి
మన కనులకు విందు చేసె గదా!


The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

Sunday, November 15, 2009

Reclining Buddha & Sitting Buddha

Reclining Buddha & Sitting Buddha in Bangkok Temples




The INTERNET now has a personality. YOURS! See your Yahoo! Homepage.

Wednesday, November 4, 2009

vaasthu

అయ్యా, ఈ వాస్తు పిచ్చి ఎయిడ్స్ కన్నా దారుణంగా వ్యాపిస్తోంది. చివరికి పెళ్ళాం పక్కన ఎడమ వైపునో లేదా కుడివైపునో కూర్చుంటేనో వాస్తు అంటే నమ్మేంత మూర్ఖత్వం మనలో పేరుకు పోతోంది. వాస్తు విరుద్ధంగా కట్టిన ఇళ్ళు ఎన్నో ఉన్నాయి.  ప్రాచీన కాలంలో విడి విడిగా ఇళ్ళు కట్టుకునేటప్పుడు ఒకరి ఇంటి బావికి మరో ఇంటి బావి దూరంగా ఉంటే ఊటలు సక్రమంగా ఉంటాయనో, వంట గదుల్లోకి గాలీ వెలుతురు బాగా రావాలని, ఒకరి వంటింటి పొగ ఇంకొకరి వంటింట్లోకి రాకూడదనో ఈ నియమాలు పాటించడం జరిగింది. మరి టాయిలెట్లు ఇంట్లో ఉండొచ్చని వాస్తులో ఉందా?

Tuesday, November 3, 2009

gollapoodi gaari dairy - article in Saakshi funday November 1, 2009

విశ్వాసం - వివేచన 1963

మీరు సాక్షి ఆదివారము సంచికలో వ్రాసే మీ అనుభవాలను చాలా కాలం నుండి చదువుతున్నాను. ముఖ్యంగా మీ ఆంధ్ర ప్రభ మరియు ఆకాశవాణి అనుభవాలను కళ్ళకు కట్టినట్టుగా వివరిస్తుంటే చాలా ఆనందంగా చదివే వాళ్ళల్లో నేను ఒకణ్ణి. ఈ ఆదివారము మీరు వ్రాసింది పూర్తిగా అసంభద్దంగాను, అనాలోచితంగాను వ్రాసారేమో అన్పించింది.
సైన్సు పరంగా మనం ఎంతో అభివృద్ధి సాధించామన్నది నిర్వివాదాంశాం అనడంలో అతిశయోక్తి లేదు. దైవ ప్రేరేపణతోనో లేక ఏ దేవుడో కలలో కన్పించో ఏదో ఒక వస్తువును ఎలా తయారు చెయ్యాలో ఎవరికీ  చెప్పిన వైనం ఎక్కడా లేదు. కాకపోతే తమ వృత్తిపరంగా వారు చేసే పనులకు వారి దైవచింతనలకు లంకె వేయడం హాస్యాస్పదంగా వుంది. నిజ నిరూపణ నిమిత్తం  పరిశోధనలు మళ్ళీ మళ్ళీ చేస్తుంటారు. నీరు జీరో డిగ్రీల దగ్గర ఘనీభవిస్తుందన్న విషయం చాల పాతదే అయినప్పటికీ ఎందుకు పరిశోధనలు మళ్ళీ మళ్ళీ అదే విషయం మీద చేస్తుంటారు?
వివేచన కన్నా విశ్వాసం గొప్పది అని చెప్పే ప్రయత్నం చేసారు.ఎలాగో చెప్పండి? సిరా వొలికితే జిల్లెళ్ళమూడి అమ్మవారు కనబడ్డారని వ్రాసారు.మీరెప్పుడైనా మబ్బుల వంక చూసారంటే మీకు కావాల్సిన రూపాలన్నీ కనబడతాయి. వంకాయ కొస్తే వినాయకుడి రూపమో అల్లా అనే అక్షరాలు కనబడితే వాటిని వెంటనే నమ్మమంటారా? కేవలం జన్యు వికృతంగా మనం కొట్టి పారేస్తాం కదా!
ఇక పుట్టపర్తి సాయిబాబా గారు చెప్పే కథలేప్పుడైనా కథలే. వాటికి ఆయన జోడించే వేదాంతం విచిత్రంగా వుంటుంది. ఒక పిల్లవాడు పుస్తకం పేజీల మధ్య ఓ పదిరూపాయల నోటు పెట్టి మరిచి పోయి వెళ్లి ఇంకెవరినో అప్పు అడగబోయాడట. ఆ అప్పు తీసుకునే ముందు ఆ నోటు కనబడితే ఆ అబ్బాయి విస్తుబోయాడట. నీతి ఏమంటే నువ్వు దేవుణ్ణి నీలోనే వెతుకు. ఇలాంటివెన్నో మీరు కావాలంటే మీకు నేను వుదహరించగలను.
మనకు లభించిన ఏ ఒక్క పురాతన ఆస్థి పంజరాలు ఏ పురాణాన్ని అయినా నిరూపించ గలదా?

Sunday, October 25, 2009

Bangkok trip


 
bapujiarcot


Try the new Yahoo! India Homepage. Click here.

Sunday, September 27, 2009

దసరా శుభాకాంక్షలతో - శిరాకిపుత్ర

తర తరాలుగా అత్యంత వైభవంగాను , సామూహికంగాను ప్రజలంతా జరుపుకునే పండగలలో దసరా ఒకటి. ఈ సందర్బంగా ఏర్పాటైన దుర్గామాత విగ్రహాన్ని తీసిన ఫోటోలు ఇవి.

Sunday, September 20, 2009

సంక్రాంతి ముగ్గులు

భోగి మంటల వెలుగులలో ఇంటిముందు ఇల్లాలు

కళ్ళాపి చల్లి వేసే సంక్రాంతి ముగ్గులు

కళ్లు విప్పార చూడచక్కనైన, ముచ్చటైన

రంగుల రంగవల్లులవి.

గొబ్బిట్లో కూర్చొని తలలాడించే పూలబాలలు.

రండి! రారండి! చూడండి

సూరివారి ఇంటి ముందు సంక్రాంతి ముగ్గులు.



Tuesday, September 1, 2009

మన తెలుగు

ఈ మధ్య ఓ పత్రికలో ఇంగ్లీషులో పది లక్షల పదాలు చేరాయి అనే చర్చలో తెలుగులో ఎన్ని పదాలున్నై అనే విషయం ప్రస్తావించబడింది. కాని నా వుద్దేశంలో అందరూ తెలుగులో ఎన్ని పదాలున్నాయని లెక్కపెట్టడం మానేసి, ఎన్ని పదాలు పోగొట్టుకొంటున్నామో లెక్కపెట్టండి. మన పక్కింటి భాష తమిళంలోకి ప్రతి ఇంగ్లీషు పదానికి సరిఅయిన పదాలని సృష్టించి పదసంపదను పెంచుకుంటున్నారు. ఇంటర్నెట్టు, ఫ్యాక్సు లాంటి వాటికి కూడా తమిళ పదాలు వాడకంలో ఉన్నాయి. ఆ మధ్య మాలతీ చందూర్ గారు అరవల భాషాభిమానాన్ని గురించి స్వాతిలో ముచ్చటించారు. మమ్మీ డాడీ అని పిలిపించుకుని మురిసి పోయే అమ్మా నాన్నలు వున్నంత కాలం తెలుగు భాషకు చెదలు పట్టకుండా చూసుకోవాలి మనం!

మమ్మీ డాడీ అని పిలిపించుకునే తెలుగు మాతా పితలు తెలుగునేమి ఉద్ధరిస్తారయ్యా ?
మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని ఇంగ్లీషులో వ్రాసుకుని పాడే పిల్లల తల్లి దండ్రులయ్యా వీరు
డాలర్ల కోసం పరుగెత్తిన పుత్రసంతానాన్ని తల్చుకుని గర్వించే జీవులయ్యా వీరు
ఈ తెలుగు సాయంత్రం తేవాలి తెలుగు భాషా ప్రపంచానికి మరో ఉదయం!

పాపం భగవంతుడు

అంద వికారాలకు అతీతుడు ఆ భగవంతుడు.
రాగ ద్వేషాలు ఎరగని వాడు.
కోపతాపాలు తెలియని వాడినెందుకు ప్రశ్నిస్తారు?
స్వార్థంతో బ్రతికే మనం దేవుడి పేరు చెప్పుకుంటూ
చేసే అన్యాయాలెన్నో?
నరకముందంటూనే చేసే పాపాలెన్నో?

Friday, August 28, 2009

కాకతీయమ తల్లీ! ( శిరాకి గారి కవిత )

ఈ శిల్పాలలో నిదురించేనో ఏ శిల్పి మధుర స్వప్నాలు
ఈ మూగవోయిన శిథిలాలలో వినిపించేనో ఏ వీరగాథలు
ఈ శిలలయందు కరడు గట్టెనో ఏ వీర వనితల భగ్న హృదయాల వేడి నెత్తురు
ఈ నాట్యశిలపై కందెనో ఏ రాజనర్తకి కోమల పాద పద్మంబులు
ఈ సింహ ద్వారంబులే చాటెనో ఏ వీర సింహుల రణవిహారాలు
ఈ మట్టిలో క్రుంగెనో ఏ మహీశుల నిండు జీవితాలు
ఈ సభా వేదికపై మోకరిల్లిరో ఏ పరాజితులు
ఘూర్ణిల్లెనో ఇట ఏ సింహ నాదంబులు
మారు మ్రోగెనో ఏ విజయ దుందుభీలు
కలాంగనల కానుకలే కాలవాహినిలో కలిసిపోవ
మిగిలినా ఈ ముత్యేపు చిప్పలు అరుణ సంధ్యా కాంతులై

Monday, August 24, 2009

ఎన్నాళ్లకొచ్చావే ఓ వానా !

అయ్యా చంద్ర బాబు గారూ, దాదాపు ఓ పది రోజులుగా రాష్ట్రంలో ఓ మాదిరి నుండి భారీగానే వర్షాలు కురుస్తున్నాయి గదా! ఇంకా మీరు కరువంటూ ఎందుకు అరుస్తున్నారు? ఓ నెల పైగా వర్షాలు లేనందువల్ల ఇంచుమించు కరువు ఏర్పడుతుందేమో అన్న తరుణంలో వర్షాలు రావడం, పరిస్థితులు కొంత వరకు మారడం జరిగింది కదా! తమ తమ పొలాల్లో నీళ్లు చూసాక ఏ రైతూ వూరుకోడు. మళ్ళీ ఎలాగైనా ఏదో పంట వేసుకోవాలని ప్రయత్నం చేస్తాడు. అందుకు తోడ్పాటుగా మీరు రైతులకు కావలసినవి అందేటట్లు ప్రయత్నం చేయండి. మీరు ఈ దిశగా ఆలోచించండి. మీకు బోధపడుతుంది.

Saturday, August 15, 2009

మిత్రుడి అకాల మరణం

ఇటీవల నా చిరకాల మిత్రుడు కారు ప్రమాదంలో చనిపోవడం జరిగింది. ఇది కర్నూలు ఊరి బయట రాత్రి సుమారు పది గంటలకు నేషనల్ హైవేలో ఎదురుగా ఆర్టీసీ బస్సు రావడం, కారు దానికి గుద్దుకోవడం, నా మిత్రుడు( కారు నడుపుతున్నవాడు) అక్కడికక్కడే చనిపోవడం జరిగింది. కారులో వున్న ఇంకా ఇద్దరు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు. ఆ బస్సులో నుంచి దిగిన వాళ్ళెవ్వరూ ఏ అంబులెన్సు కోసమో ప్రయత్నించలేదు. దిగిన వాళ్ళలో ఎవరో సెల్ఫోన్లు, మెడలో వున్న నగలు కొట్టేసారు. ఓ గంట తర్వాత దారిన పోతున్న ఓ డాక్టరు దంపతులు ఒక అంబులెన్సు తెప్పించి ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న ఆ ఇద్దరినీ హాస్పిటలుకు తరలించారు. ఇది మనం ప్రదర్శిస్తున్న మానవత్వానికి ఒక మచ్చు తునక. ప్రక్క వారిని పట్టించుకోని మనం, మనకో మన వాళ్ళకో ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఎవరు పట్టించుకోలేదనివాపోతుంటాము.

Thursday, August 13, 2009

దేవేందర్ గౌడ్ గారూ

మీరు తెలుగు దేశాన్ని వదలి వెళ్ళడం, నవ తెలంగాణా పార్టీని స్థాపించడం, కొంత హడావిడి చేయడం( కార్ల నెంబర్లను మార్చడం వంటివి), చిరంజీవి గారు ప్రజారాజ్యం పార్టీ స్థాపించగానే అటువైపు దృష్టి సారించడం, మీ నవ తెలంగాణా పార్టీని అందులో విలీనం చేయడం, రెండు స్థానాల్లో ప్రజారాజ్యం తరఫున పోటీ చెయ్యడం, చిత్తుగా ఓడిపోవడం -- ఇవన్నీ గమనిస్తే మీకు మీ సత్తా ఏమిటో తెలిసివచ్చే వుంటుంది.
చిన్న చితకా పార్టీలే తమ అపజయానికి మూలం అని నమ్ముతూ వాటిని నిర్వీర్యం చేసే పనిల్లో పడ్డారు చంద్రబాబు నాయుడు గారు.ఈ సందర్భంలోనే వారు మిమ్మల్ని రమ్మని పిలవడం జరిగిందేమో! అదే అదనుగా పాత గూడే పదిలం అన్న చందాన కార్యకర్తల అభీష్టం అంటూ చిరంజీవిని ఒంటరివాడుగా చేస్తూ వెళ్ళిపోయిన వారి బాటలోనే మీరూ ప్రజారాజ్యం పార్టీని వదలి వెళ్ళడం జరిగింది.
ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మీరు చారిత్రిక తప్పిదం అనే మాటను పదే పదే వాడుతున్నారు. ఇదెంతవరకు ఉచితం? మీరు చెప్పే చరిత్ర ఏమిటి? మీ చరిత్రకు ఇది ఎలా వర్తిస్తుంది?
తమ్ముడు తమ్మినేని తమ దారిలోనే ఎగిరి వచ్చేశాడు. ఇక మిగిలింది ప్రజారాజ్యం ఎమ్మెల్యేలే! వారిని తీసుకు వచ్చే బృహత్కార్యాన్ని మీరిద్దరూ చేపడతారేమో ! అందరినీ జీరోలుగానే వుంచే ఏకైక నెంబర్వన్ చంద్రబాబు బహు గొప్పవాడు సుమా ! ఒకటి ప్రక్కన ఎన్ని సున్నాలు వుంటే ఏర్పడే సంఖ్య అంత పెద్దది కదా !

Friday, August 7, 2009

మా తాత గారు మరణించినప్పుడు మా నాన్నగారుశిరాకి (శివరామకృష్ణ) వ్రాసినది.

ఒక మహోన్నత జీవితమే ముగిసెనో ఈ మంటలలో
ఒక కరుణార్ద్ర హృదయమే కరగెనో ఈ కాలెడి చితిలో
ఒక ధీరచిత్తుని ఆశయాలే అడుగంటెనో ఈ క్షితిలో

దేవుడు ఎటులుండునో ఎరుంగము మేము
వెలసిన వేయి ఆలయాలలోనో, పొగచూరిన కటిక రాతి రూపాలలోనో
కాని కన్నతండ్రివి నీవు, మాకు కన్పించిన దైవానివి నీవు.

పెరిగితిమి పెద్దలై కాఠిన్యం ఎరుగని నీ కనుసన్నలలో
నేర్చితిమి విద్యాబుద్ధులు నీ చేయూతలలో నిలద్రొక్కి.
నీతిపథములో నడచితిమి నీ కాలి జాడలలో.
నీ ఆశలే మా ఆశయాలు, నీ భావములే మా బాటలు.
కనుల నీరు క్రమ్మంగ కరగిన చిత్తములో ఉద్భవించెను ఈ ఊహలు.

లేవిక నీవు మాకిక నీ భౌతిక రూపాన
కాని వున్నావు నీవు నీ విశ్వరూపాన.
అరుణ సంధ్యా కాంతియే నీ మేనిచ్చాయయై
కొలనుల కలువలే నీ కనులై
నీలిగిరుల హిమమకుటమే నీ నిర్మల భావాలై.

Wednesday, August 5, 2009

పాపం శ్రీనివాస యాదవ్

శ్రీనివాస యాదవ్ గారూ, దేవేందర్ గౌడ్ గారి విషయంలో చంద్రబాబు గారు మీ సలహా పాటిస్తారని మీరు ఎలా భావిస్తారండీ? ఈ రోజు దేవేందర్ గారు అవసరమైనట్లే, మరో రోజు మీరు కూడా చంద్రబాబు గారికి అవసరమవుతారులెండి.
చంద్రబాబు గారి నైజం తెలిసిన మీరెందుకు తొందరపడి రాజీనామా చేస్తారు?
సమైక్య పార్టీ ఏమైనా స్థాపిస్తారా? చివరికి రాజీ పడతారా? ఒక విషయం గుర్తుంచుకోండి. చంద్రబాబు అందరినీ జీరోలుగానే వుంచుతాడు. ఎందుకంటే జీరోకు విడిగా విలువ లేదు. కాని ఏ అంకెకు ప్రక్కన వుంటే ఆ అంకె విలువ చాలా ఎక్కువగా పెరుగుతుంది. చంద్రబాబు అటువంటి అంకెలాంటి వాడు. అందరినీ జీరోలుగా వుంచి తన విలువ పెంచుకుంటూ వుంటాడు.
మహా కూటమి మాయగాడు ఆయన సుమా!

నా పాత కవిత (1965 )

మోసపు వేషాల వారికి
రాజకీయమే మోక్షమురా!
దేశ క్షేమం అంటారురా
దేహక్షేమం చూసుకుంటారురా!
చెప్పేది చేయరురా
చేసేది చెప్పరురా!
సత్యానికి అర్థం లేదురా
వాగ్దానాలకు విలువ లేదురా!
స్వాతంత్ర్య నాయకులమంటారురా
స్వార్థనాయకులయిన వీళ్ళురా!
పదవులకు పట్టిన త్రుప్పురా వీరు
పదపదరా! వదలగొట్టారా ఈ త్రుప్పును!

Monday, August 3, 2009

నా పాత కవితలు (1965 )

ముగిసిపోకుమా ఓ చల్లని రాతిరీ!
చందమామ చల్లదనంలో
ఒకటైన వలపు హృదయాలను
చెదరనీకుమా ఓ రాతిరీ!
నిద్రాదేవి ఒడిలో
కస్టాలు మరచిన నిరుపేదలకు
మెలకువ రానీయకుమా ఓ రాతిరీ!
పేదల నెత్తురు తాగే
పరమ రాక్షసులను
లేవనీకుమా ఓ రాతిరీ!
కండలు పిండి చేసే కార్మికులను
కాస్త నిదురైన పోనివ్వు ఓ రాతిరీ!

Saturday, August 1, 2009

ఏం జరుగుతోంది చిరంజీవి గారూ ?

చిరంజీవి గారూ? ఏమి జరుగుతోంది? ఒక్కొక్కరే బయటికి వెళ్లడానికి తయారవుతున్నారు. ప్రజారాజ్యం సినిమా సగం చూసి ఇంటర్వెల్లో జనం వెళ్లి పోతున్నట్లుంది. ఇక వున్న ఎమ్మెల్యేలనైనా కాపాడుకునే ప్రయత్నం మొదలు పెట్టండి. వాళ్ళూ వెళ్ళే ప్రయత్నాల్లో పడ్డారంటే మాత్రం జనం వాళ్ల జన్మలో సినిమా వాళ్లకు ఓట్లు వేయరు. రాజకీయం వేరు, సినిమాలు వేరు అనేది సినిమా వాళ్లు ఇప్పటికైనా తెలుసుకోవలసిన సత్యం.

Friday, July 10, 2009

తక్షణ కర్తవ్యం

ఉవ్వెత్తున లేచిన తరంగం తీరాన్ని తాకేటప్పుడు చూసే వారికి కలిగే ఆనందం ఎంతో గొప్పగా వుంటుంది. అలాగే చిరంజీవి గారు రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు ఎంతో మందికి కలిగిన ఆనందం చెప్పనలవి కాదు. కాని ఇప్పుడు జరుగుతున్నదేమిటి? చావు తప్పి కన్ను లొట్ట పోయినంత మాత్రం కాకపోయినా, పంతొమ్మిది సీట్లు వచ్చాయి కదా. ఆ ఎమ్మెల్యేలు వుంటారా లేదా ఎగిరిపోతారా అనే సంశయం కలుగుతోంది. సామాజిక న్యాయం అంటూ ప్రజలతో ఆడుకున్నారా? లేక ప్రజలు ఏం చెప్పినా వింటారు అనుకుంటున్నారా? గెలిచిన స్థానాలలో ఏం చెయ్యాలో ఆలోచించడం లేదెందుకు? అసెంబ్లీ లేనప్పుడు తమ తమ నియోజక వర్గాల్లో తిరగమని తమవాళ్ళకు చెప్పొద్దా చిరంజీవి గారు. అంతే గాని సమీక్షలు అంటూ హైదరాబాదులో కాలం ఎందుకు వృధా చేస్తున్నారు?

Monday, June 29, 2009

సామాజిక న్యాయం

నిన్న మగధీర ఆడియో రిలీజు సభలో చిరంజీవి గారిని మళ్ళీ సినిమాలలో నటించమని అందరూ అడగడం, దానికి వారు చూద్దాం అనడం జరిగింది. వారం క్రితం ఇక సినిమాలలో నటించను అని బల్ల గుద్ది చెప్పి, అప్పుడే చూద్దాం అనడం వారి డోలాయమాన మనస్సును సూచిస్తోందా? పార్టీ వ్యవహారాలు చూస్తుంటే ఎవరూ సేరియస్సుగా ఏ విషయాన్నీ పట్టించుకుంటున్నట్టు కనబడటం లేదు. ప్రయివేటు స్కూళ్ళ ఫీజు గురించి ఆందోళన చేపట్టారు గాని స్కూలు భవనాలు లేని గవర్నమెంటు స్కూళ్ళ గురించి ఏమైనా పట్టించుకుంటున్నారా? ఎక్కడండీ సామాజిక న్యాయం?

Friday, June 26, 2009

భగవంతుడు

అంద వికారాలకు అతీతుడు ఆ భగవంతుడు.
రాగ ద్వేషాలు ఎరగని వాడు.
కోపతాపాలు తెలియని వాడినెందుకు ప్రశ్నిస్తారు?
స్వార్థంతో బ్రతికే మనం దేవుడి పేరు చెప్పుకుంటూ
చేసే అన్యాయాలెన్నో?
నరకముందంటూనే చేసే పాపాలెన్నో?
మళ్ళీ క్షమించమని వేడుకోవడమెందుకో?

Saturday, June 20, 2009

ప్రజారాజ్యం ఎటు పోతోంది?

ప్రజారాజ్యం పునాదుల్లో ఒకరైన మిత్రా గారు కూడా రాజీనామా చేసారు అంటే ఆశ్చర్యంగా లేదు. ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళొచ్చు అనే పద్దతిలో ఈ పార్టీ నడుస్తుందేమో అన్పిస్తోంది. సామాజిక న్యాయం అంటూ హోరెత్తించిన ప్రజారాజ్యం పరిస్థితి దయనీయంగా మారుతుందేమో! ఉన్న కొద్ది మంది ఎమ్మెల్యేలను కాపాడుకోకపోతే చిరంజీవి ఒక్కరే పార్టీలో ఉంటారేమో?
సమీక్షల పేరుతో ఏర్పాటు చేసిన మీటింగులకు ఎంతమంది వచ్చారో అందరికీ తెలుసు కదా. ఏదో సినిమా ఫ్లాప్ అయినట్లు చిరంజీవి అనుకుంటున్నారేమో. మేలుకోకపోతే అడ్రసు కూడా మిగలదు చిరంజీవి గారూ. సామాజిక న్యాయం సంగతేమో గాని, మిమ్మల్ని, మీ పార్టీ వాళ్ళను గెల్పించిన నియోజకవర్గాల అభివృద్ది జరగాలన్నా, మళ్ళీ ఏదైనా ఎలక్షన్లలో గెలవాలన్నా మీరు పార్టీని కాపాడుకోండి.

మా తెలుగు తల్లి

ఈ మధ్య ఓ పత్రికలో ఇంగ్లీషులో పది లక్షల పదాలు చేరాయి అనే చర్చలో తెలుగులో ఎన్ని పదాలున్నై అనే విషయం ప్రస్తావించబడింది. కాని నా వుద్దేశంలో అందరూ తెలుగులో ఎన్ని పదాలున్నాయని లెక్కపెట్టడం మానేసి, ఎన్ని పదాలు పోగొట్టుకొంటున్నామో లెక్కపెట్టండి. మన పక్కింటి భాష తమిళంలోకి ప్రతి ఇంగ్లీషు పదానికి సరిఅయిన పదాలను సృష్టించి పదసంపదను పెంచుకుంటున్నారు. ఇంటర్నెట్టు, ఫ్యాక్సు లాంటి వాటికి కూడా తమిళ పదాలు వాడకంలో ఉన్నాయి. ఆ మధ్య మాలతీ చందూర్ గారు అరవల భాషాభిమానాన్ని గురించి స్వాతిలో ముచ్చటించారు. మమ్మీ డాడీ అని పిలిపించుకుని మురిసి పోయే అమ్మా నాన్నలు వున్నంత కాలం తెలుగు భాషకు చెదలు పట్టకుండా చూసుకోవాలి మనం!

మమ్మీ డాడీ అని పిలిపించుకునే తెలుగు మాతా పితలు తెలుగునేమి ఉద్ధరిస్తారయ్యా ?
మా తెలుగు తల్లికి మల్లె పూదండ అని ఇంగ్లీషులో వ్రాసుకుని పాడే పిల్లల తల్లి దండ్రులయ్యా వీరు
డాలర్ల కోసం పరుగెత్తిన పుత్రసంతానాన్ని తల్చుకుని గర్వించే జీవులయ్యా వీరు
ఈ తెలుగు సాయంత్రం తేవాలి తెలుగు భాషా ప్రపంచానికి మరో ఉదయం!

Monday, June 8, 2009

అవినీతికి పునాదులు మనమే.

దేవుడు లేని చోటైనా వుంటుందేమో గాని అవినీతి లేని చోటు వుండదేమో! అవినీతి నిరోధక శాఖ వారికి రాజశేఖర రెడ్డి ఇచ్చిన ధైర్యం చాలా మెచ్చుకోగలిగిందే. వేయిమైళ్ళ ప్రయాణానికి మొదటి అడుగులాంటిది అడుగు. అవినీతి ఎక్కడెక్కడ పుడుతుందో అందరికీ తెలుసు. ప్రతి శాఖలో రక రకాలైన లైసెన్సులు ఇవ్వడానికి గాని, రెన్యువల్ చెయడానికి అయ్యే ఇతర ఖర్చులు అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో ప్రైవేటు కంపెనీలల్లోకూడా ఎంత అవినీతి పేరుకుపోయిందో చెప్పక్కర్లేదు. ఐటి కంపెనీ వుద్యోగాలకు బ్యాక్ డోరు పద్దతిలో చేరడం అంటే అందరికీ తెలిసిందే. కాస్త నీతిగా వుందామనుకునే వారు ఎలాంటి మానసిక వత్తిడికి లోనవుతుంటారో చెప్పక్కర్లేదు. కొన్ని శాఖల్లోనా నిజాయితీతో పని లేకుండా నా వాటా నీకు వచ్చి పడుతుంటే నా తప్పేమీ లేదనుకున్న వారు లేక పోలేదు. అయినా ఇచ్చే చేయి వుంటే కదా పుచ్చుకునే చేయి ముందుకు వస్తుంది.
మనలో ఎంతమంది ఏమీ ఇవ్వకుండా పని అయ్యే దారి (చట్టపరంగా) వుందా అనే ప్రయత్నం చేస్తారు చెప్పండి? అడిగే వాళ్ళని మేమెందుకు డబ్బులివ్వాలని అడిగే ధైర్యం మనకు లేదా? అప్పుడే మన టైమంతా వృధా అయిపోతున్నట్లు, అందుకే ఈ అడ్డ దారిలో వెళ్ళడం అవసరం అన్నట్లు ప్రవర్తిస్తాం. కాబట్టి ఒక్క రూపాయి కూడా అవినీతికి పునాది కాకుండా చూసే బాధ్యత మనదే అంటే అతిశయోక్తి కాదేమో!

Thursday, June 4, 2009

పద్మార్పిత గారి ఎందుకని కవిత స్ఫూర్తితో

మదిలోని విరహం
కనులలో నీరై కురవంగ
మెరిసే తారకలన్నీమసకబారుతూ కనిపింపంగా
వేసవిలో వీచే వడగాడ్పులైనా
శరదృతువులో వణికించే చలిగాడ్పులైనా
నా ఈ విరహాన్ని మరువనివ్వలేదు ఓ క్షణమైనా
చెదిరి పోలేదు నా ప్రేమ ఇసుమంతైనా.
ప్రేమైనా విరహమైనా
నాణానికి రెండు వైపులు,
పగలు రాత్రుల ప్రతిబింబాలు కాబోలు!
ఏది ఏమైనా ప్రేమామృతాల
విరహాగ్నుల కలబోతే గదా ఈ మనస్సు.

Sunday, May 31, 2009

చంద్రబాబు గారూ !

ఇటేవల జరిగిన ఎన్నికలలో మీ తెలుగుదేశం ఓడిపోవడంలో మీ తప్పొప్పులు ఎన్నున్నాయో అన్న విషయాన్ని పూర్తిగావిస్మరించి, EVM మిషన్లు సరిగ్గా పనిచేయలేదని, ఓటర్లు సరిగ్గా ఓట్లు వేయలేదని, ప్రజారాజ్యం మరియు లోకసత్తాపార్టీల వల్ల మీ ఓట్లు చీలిపోయాయని వాపోవడం చాలా హాస్యాస్పదంగా వుంది.
అసెంబ్లీలో మీ సంఖ్య పెరగలేదా? దీనికి కారణం మీకు ఓట్లు వేసినవారా? లేదా EVM మాయ అంటారా! కాంగ్రెసునుపెద్ద బూచిగా చూపించి టిఆర్ఎస్ ను, కమ్యూనిస్టులను కూడగట్టుకుని మీ సీట్లు పెంచుకుంది వాస్తవం కాదా? ఇప్పుడువాళ్లు పనిచేయలేదనో, కాంగ్రెస్సు వోట్లను సరిగ్గా చీల్చలేక పోయారనో చెబుతున్నారు.
బాలకృష్ణతో తొడలు కొట్టించినంత మాత్రానో, జూనియర్ ఎన్టీఆర్ తో కుప్పిగంతులు వేయించినంత మాత్రానో ఓట్లు రాలవుఅన్న విషయాన్ని మీరిప్పటికయినా గ్రహించండి.
అప్పుడే మీ ప్రతాపం కొత్త పార్టీలైన ప్రజారాజ్యం మరియు లోకసత్తాల మీద కనబడుతోంది. ముందు చిన్న శత్రువుల పనిబడితే, తర్వాత ఏకైక పెద్ద శత్రువు సంగతి చూసుకోవచ్చు అనుకుంటున్నారేమో! మీ శత్రువులందరూ ఏకమవడానికిమీ చర్యలు నాంది అవుతుందేమో కాస్త ఆలోచించండి!

సామాన్యుడు (ఎప్పుడో వ్రాసుకున్నది )

సామాన్య మానవుడా
నువ్వెలా వుంటావో నాకు తెలీదు.
పట్టెడన్నం కూడా నీకు రోజూ దొరకదని అన్నారు కొందరు
గోచీ గుడ్డ కూడా లేని వాడవని అన్నారు మరికొందరు.
పక్షులకైనా గూళ్ళు వుంటాయి కాని
నీకు అది కూడా లేదన్నారు.
గాంధీ టోపీ పెట్టుకుని నీ పేరు చెప్పుకుని నీకు వేసారు టోపీ.
ఎర్ర చొక్కాలు వేసుకుని విప్లవమంటూ అరిచి నిన్ను వెర్రివాన్నిచేసారు.
పసుపు చొక్కాలు వేసుకుంటూ నీ బ్రతుకు పచ్చగా చేస్తామంటూ
కాషాయ వస్త్రాల నాయకుడి శిష్యులు బయలు దేరారురా ఇప్పుడు.
ఈస్టమన్ రంగుల చిత్రంలాంటి రాజకీయాలురా ఇవి
నీ పేరు చెప్పి తింటారు పంచభక్ష్య పరమాన్నాలు
వేస్తారు ఇంకా రంగుల చొక్కాలు
కడతారు మేడలపై మేడలు.
ఇంతైనా ఇన్నైనా నీకు లేవురా
కూడు, గుడ్డా , గూడు.

Friday, May 29, 2009

పాపం చంద్రబాబు.

ఆడలేక మద్దెల ఓటిదన్నట్లు చంద్రబాబు ఈవీఎం మిషన్లు బదులు బాలట్ పెట్టెలు వాడాలని సెలవివ్వడం ఆశ్చర్యంగా వుంది. ఏవో గణాంకాలు వల్లెవేస్తూ ఓటర్లు ఏదో తప్పు చేసెసినట్లు లేకపోతే తామే గెలిచివుండే వారమని చెప్పడం విచిత్రంగా వుంది. ఏం, తెలుగుదేశం తప్పేమీ లేదా?
అయినా హైటెక్ సీఎం గా పేరు తెచ్చుకున్న చంద్రబాబు కావాలంటే ఈవిఎంలో వుండే ఇబ్బందులను అధిగమించేటట్లు ఈసీ
ఐఎల్ వారికి సలహాలు ఇవ్వచ్చుగా. అంతేగాని తిరోగమన ఆలోచనలకు తావిస్తూ, విమర్శలు చేయడం మంచిది గాదు. తన మైండ్సెట్ మార్చుకోవాలేమో!

Thursday, May 28, 2009

వినాలనుంది - Listeners' choice - రేడియో స్పందన

వినాలనుంది - Listeners' choice

ఏమిటి ప్రియా? ఏం చేస్తున్నావు?

రారా సుష్మా! వినాలనుంది ప్రోగ్రాము రికార్డింగ్ చేస్తున్నాను. కాస్త పాటలు తగ్గుతున్నై . ఏం చేద్దామని ఆలోచిస్తున్నాను.

అంత ఆలోచన ఎందుకమ్మా? నేను చెప్పినట్టు విను. ఆ వరంగల్ సంగీత , సతీష్ , పవిత్ర , ప్రేమకుమార్ల పేరు చెప్పి ఎన్నెన్నో జన్మల అనుబంధం, ఇంకో రెండు పాటలు ఆ చివర, ఈ చివర వేసేస్తే సరిపోతుంది .ఇంకా తగ్గిందనుకో నా పేరు చెప్పి ఏదో పాట వేసి నీకుడేడికేటు చేసుకో .

అంతేనంటావా సుష్మా?అంతే ప్రియా . ఇక ఆలోచించకు . కానిచ్చేయ్ . అంతా వినేవాళ్ళ ఖర్మ . మనకు ఎందుకమ్మ బాధ ?

Tuesday, May 26, 2009

అయ్యా చిరంజీవి గారూ,

మీ ప్రజా రాజ్యం వెబ్ సైటులో ఎన్నికల తర్వాత జరిగిన పరిణామాల గురించి ఒక్క ముక్క కూడా లేదు. ఇలాగైతే ఎలాగండి? మీకు కొన్ని వేల సంఖ్యలో వుత్తరాలు వచ్చి వుంటాయి గదా? వీటిలో నిర్మాణాత్మకంగా వున్నవాటిని ప్రచురిస్తూ, వాటిపై మీ సభ్యులు మరియు కార్యకర్తల అభిప్రాయాలను చెప్పమంటే బాగుంటుంది కదండీ? లేకపోతే మీ ప్రజారాజ్యం వెబ్ సైటు చచ్చుబడి పోతుంది జాగ్రత్త! ప్రజాసమస్యల పట్ల మీ కార్యకర్తల అభిప్రాయాలను ఎప్పటికప్పుడు అడుగుతూ వుండండి. అసెంబ్లీలో మీరు మాట్లాడ్డానికి ఇవి చాలా దోహదపడతాయండి.
ఇట్లు,
భవదీయుడు,
బాపూజీ

Monday, May 18, 2009

యువకులూ జాగ్రత్త!

యువతకు పెద్ద పీట వేస్తాం! అని ప్రతి పార్టీ ఎలక్షన్ల ముందు యువకులను ఊరించడం పరిపాటి అయిపోయింది. వీధుల్లో జెండాలు పట్టుకుని తిరగడానికి, ఇంటింటికీ వెళ్లడానికి దేహశక్తి వున్నయువకుల అవసరం వయస్సు పై బడ్డ నాయకులకు ఎంతో వుంది. యువకుల్లో ఆశావాదం ఎక్కువగా వుంటుంది కాబట్టి వాళ్లకు ఈ ముసలి నాయకుల మాటలు చాలా ఇంపుగా, నిజాయితీగా అన్పిస్తాయి. కాని తీరా, ఎలక్షన్లు వచ్చాక జరిగిదేమిటి? నాయకుల పుత్రరత్నాలు తెరమీదకు వస్తారు. లేదా కొన్ని అవసరాల వల్ల కొంత మందికి టికెట్లు ఇవ్వాల్సి వచ్చిందని, గెలుపు ప్రధానం కాబట్టి కాస్త సర్దుబాటు అవసరమైందని చెప్పడం జరుగుతుంది.
ఎలక్షన్లు దగ్గర పడుతున్న కొద్దీ అవకాశవాదులు ఎంతో మంది పార్టీల్లో చేరిపోతారు. అప్పుడు పార్టీకి వారి అంగబలం, ధనబలం అవసరం కదా! కాబట్టి, యువకులూ జాగ్రత్త!

Saturday, May 16, 2009

చిరంజీవిగారూ!

నిన్న ఎలక్షన్ల ఫలితాలను విశ్లేషిస్తూ చిరంజీవి సమయం సరిపోలేదు అని ఓ మాట అన్నారు? రాజకీయాల్లోకి రావాలా వద్దా అంటూ కాలాయాపన చేసిందెవరు? ఏ పేరు పెట్టాలా అని రోజులు గడిపింది ఎవరు? మీటింగ్ ఎక్కడ పెట్టాలా అని ఆలోచిస్తూ, వలస పక్షులకోసం ఎదురుచూస్తూ, మీటింగులకు వచ్చే వాళ్ళంతా వోట్లేస్తారన్న భ్రమలో వుండిదెవరు?
అయ్యా, రామారావు రాజకీయాల్లోకి వచ్చిన నాటి పరిస్థితి వేరు అని అందరు చెప్తున్నా విన్నారా? మీరు చేసిన సర్వేలు నిజాన్ని మీకు చెప్పాయా? మేధావుల మాటలు ప్రక్కన బెడితే ఏం జరుగుతుందో మీరే కాదు, కేసీయార్ సైతం ఇంకా నేర్చుకో లేదు. వెళ్ళిపోయిన వారి మీద అభాండాలు వేసారు గాని వాళ్ళు చేసిన విమర్శలను పట్టించుకున్నారా? వుట్టికెగరలేనమ్మ స్వర్గానికెగురుతానన్న సామెత వూరకే పుట్టలేదు మరి! ఇప్పుడైనా ఎవరు మనవారు అని ఆలోచించండి.
విశ్లేషణలు అని మరీ కాలయాపన చేయకండి?

Thursday, May 14, 2009

కాలాతీతులు


కాకతీయుల ప్రాభవానికి,
కాలగమనానికి సాక్షులం.
ముష్కరుల దాడికి
మోచేతులు పోయినా, మోకాళ్ళు పోయినా
జీవిస్తున్నాము జడవక
నాటి శిల్పులు చెక్కిన శిల్పాలమై.

Wednesday, May 13, 2009

ఏమని వ్రాయను? -రేడియో స్పందన

గజిబిజిగా గమ్మతుగా మాట్లాడుతూ
మంచిపాటలు వేస్తూ
సుప్రభాతం చెప్పే సుస్వరాల సుష్మ గారూ!
మీ ప్రియను నేనంటూ
మధుర స్వరంతో
ప్రియరాగాలు అందించే ప్రియా !
నేను నందూను అంటూ
నాన్ స్టాపుగా మాట్లాడుతూ
లేటెస్ట్ పాటలు వినిపించే నందూ !
మంచి పాటలే కాదు
మంచి మాటలు కూడా వినండంటూ
సాహితీ కుసుమాలను చక్కటి వ్యాఖ్యానంతో
అందిచే మృదుభాషిని మృణాళిని గారూ !
మా శ్రోతల హృదయాల
స్పందనల ప్రతిరూపమే
మీరందరూ మా రేడియో స్పందనలో!


బలే మంచి రోజు! పసందయిన రోజు!


ప్రతి సంవత్సరానికి మూడు వందల అరవై అయిదు లేదా ఆరు రోజులు వుంటాయి. ఇవన్నీ మంచి రోజులే అని నా నమ్మకం.
వాతావరణ పరిస్థితులు అనుకూలించినంత కాలం ఏ రోజయినా మంచి రోజే అవుతుంది కదా! పంచాంగం ముందర పెట్టుకుని ఏవో గణిస్తూ, ఫలాన రోజు దివ్యంగా వుందనో, ఇంకో రోజు అసలు బాగా లేదనో కొంత మంది చెప్తుంటారు.
మరి ఆ రోజు రైళ్ళు, బస్సులు, విమానాలు ఎక్కి ఎవరూ ఏ పనికీ వెళ్ళడం లేదా? ఏమీ చూడకుండా కొత్త పనులు మొదలు పెట్టిన వాళ్ళున్నారు. ఇలా అడిగితే వితండ వాదం అంటారు గాని సమాధానం చెప్పరు. తర్కంగానే భావించి జవాబు చెప్పొచ్చుగా. పంచాంగాలను నమ్ముకొని యుద్ధాలలో ఓడిపోయిన రాజులున్నారంటే నమ్మండి. ఈ మధ్య మంచిరోజు చూసుకొని గర్భవతులకు సిజేరియన్ ఆపరేషన్లు చేయించి మంచిరోజున బిడ్డ పుట్టాడు అని మురిసిపోతున్నారు. కృత్రిమంగా మనం చూసిన రోజున పుట్టించిన వాడి జాతకాన్ని ఎలా గణిస్తారు? ఇంతకీ నా అభిప్రాయం ఏ రోజయినా మంచి రోజే. ఏ వేళయినా మంచి సమయమే! ప్రతి రోజును సద్వినియోగం చేసుకోండి. అంతే గాని మంచి రోజు కాదని వృధా చేసుకోకండి.

ఉదయ రాగం

మా ఇంటి వేపచెట్టు మీద రాత్రంతా వేచివుండి
వెలుగు రేకలు ఆకాశంలో విచ్చుకోకముందే
మగత నిద్రలో కలలు కంటున్నా
కర్ణామృతంగా నా చెవుల్లోకి జారే కోయిల కూతలకు
సరిరాదు ఏ ఆనందమూ.
ప్రకృతి ప్రసాదించిన వేకప్ కాల్ ఇదేనేమో!

Tuesday, May 12, 2009

అన్నమయ్య - లక్ష గళ అర్చన

ఎందుకో ఈ ప్రోగ్రాం నిరాశపరిచింది. స్టేజి మీద కూర్చున్న వారి పాట కచ్చేరి అనిపించింది. మరెవ్వరీ గొంతు వినబడకబోవడం ఆశ్చర్యం కదా! గిన్నిస్ వారు మరీ ఫ్రేము కట్టించి సర్టిఫికేటు వెంటనే ఇవ్వడం మాయగా ఉంది. లక్ష మంది వచ్చారన్నది వాస్తవం. పాడారన్నది కేవలం నమ్మకం. అంతా అన్నమయ్య పేరుతో గొప్ప పబ్లిసిటీ స్టంటు. అంతా సిలికాన్ మహత్యం!

భోగి మంటలు

గడచిన భోగి పండగనాడు మా ఉషోదయ అపార్టుమెంటు ఆవరణంలో భోగిమంటల కోసం మా శివశంకర్ గారు పాత తలుపు చెక్కలు ఇచ్చారు. ఆ భోగిమంటలు వేసిన ఆనందంలో వ్రాసుకున్న ఓ చిట్టి కవిత.

శివశంకరుడిచ్చిన దారుముక్కలతో భోగిమంటలు వేయంగ
అగ్నికీలలు శివతాండవమాడంగ
ఉషోదయవాసులు ఊయలలూగంగ
తెచ్చి యిచ్చె సంక్రాంతి లక్ష్మి సకల శుభములు!

మా పెద నాన్న

కొందరికి నాన్నవు నీవు,
మరికొందరికి మర్చిపోలేని పెదనాన్నవు నీవు.

ఓరుగల్లు అంటే అందరికీ గుర్తొచ్చేది కోటగోడలు, శిల్పతోరణాలు.
కాని మాకు గుర్తొచ్చేది రేమింగ్టన్ రాండ్ టైపు మిషను మీద టక టక లాడే నీ వ్రేళ్ళు,
వాటి స్పీడుఅందుకోవాలని పరిగెత్తే నీ ఆలొచనా తరంగాలు.
చెల్లమ్మ మా అమ్మ, నీ సహచరి నీకు తోడుండి
నీ కాన్సరులో కూడా నీకు తోడైంది
మా అందరికీ మరుజన్మలుంటే నీవే కావాలి నాన్నవి, పెదనాన్నవి.

చనిపోయిన వారికి కర్మకాండలు అవసరమా? - 2

....ఈ కర్మకాండలు చేయకపోతే 'ఈ ప్రేతాత్మ' ఇక్కడే తిరుగుతూ వుంటుందని అది బ్రతికున్న మనకు, మన పిల్లలకు మంచిది కాదని నూరి పోస్తారు. మన మధ్యలోనుంచి వెళ్ళిపోయిన మనిషి ప్రేతత్మగా మారి మన చుట్టూ తిరిగితే మనకేమిటి? మనకెలా చెడు జరుగుతుంది? మరణం తర్వాత మనమెవ్వరూ చూడని ఏదో లోకాలకు ఆ ఆత్మ వెళ్లి మన పితృ దేవతలను చేరుకోవాలాట. దీన్ని ఎలా నమ్మాలి? ఎందుకు నమ్మాలి? ఆ ఆత్మ మనకెందుకు చెడు చేస్తుంది?
చనిపోయిన మనుషులు బ్రతికున్న వారి జ్ఞాపకాలలో బ్రతుకుతారు గాని ఎక్కడో ఏదో లోకాలలో మాత్రం కాదు. కర్మకాండలు, శ్రాద్దకర్మల పేర్లతో బ్రతికున్న మనమెందుకు వేలకువేల రూపాయలు ఖర్చు చేయాలి?
జబ్బుతో వున్న మనిషిని ఎంతయినా ఖర్చు పెట్టి కాపాడుకోవడానికి ప్రయత్నం చేయడంలో అర్థం వుంది. ఆ మనిషి బ్రతికి పది కాలాల పాటు ఉండాలని కోరుకోవడంలో అర్థం వుంది. కాని అదే మనిషి దురదృష్టవశాత్తూ చనిపోతే అతన్ని దహనం లేదా ఖననం చేయడం మన బాధ్యత. ఆ తర్వాత కర్మకాండకు అంటూ వేలకు వేలు ఖర్చు చేయడం మూర్ఖత్వం అవుతుంది.

చనిపోయిన వారికి కర్మకాండలు అవసరమా?

మనిషి తనలో వున్న ప్రాణం ఎగిరిపోగానే నిర్జీవమై శవంగా మారిపోతాడు. ఇక అతని ప్రయాణం శ్మశానానికే. అక్కడఅతన్ని పూడ్చి పెట్టడమో లేక కాల్చివేయడమో జరుగుతుంది. ఇది ఇప్పుడు బ్రతికి వున్న మనమందరమూ చూస్తున్ననిజం.
కాని ఇంతటితో కథ అయిపోదు. బ్రతికివున్న వాళ్లకు అసలు కష్టాలు మొదలవుతాయి.
మనిషిలోంచి వెళ్ళిపోయిన 'ఆత్మ' ఇంకా ప్రేతాత్మగా వుంటుందని, తాను ఇన్నాళ్లుగా బ్రతికిన పరిసరాలను విడిచి వెళ్ళక
అక్కడే తిరుగుతూ వుంటుందని, దాన్ని సాగనంపడానికి 'కర్మకాండలు' నిర్వహించాలని నిర్వచనాలు చెప్తారు మనచుట్టూ వున్న వారు.

మిగతా తర్వాత...